Begin typing your search above and press return to search.

మహేష్.. ఊపిరి పీల్చుకోనివ్వవా?

By:  Tupaki Desk   |   4 May 2016 10:19 AM IST
మహేష్.. ఊపిరి పీల్చుకోనివ్వవా?
X
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. ప్రమోషన్ ఎంత ముఖ్యమో బాలీవుడ్ వాళ్లు సౌత్ ఇండస్ట్రీలకు చూపించారు. మన టాలీవుడ్లో ఆ సంగతి చాలా త్వరగా గుర్తించి.. ప్రమోషన్ విషయంలో పెట్టుకున్న హద్దుల్ని చెరిపేసిన హీరో మహేష్ బాబు. గత కొన్ని సినమాల నుంచి మహేష్ తన సినిమాల్ని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. సరిగ్గా ప్రమోట్ చేస్తే ఓ సినిమా రేంజ్ ఎలా పెరుగుతుందో ‘శ్రీమంతుడు’తో చాలా బాగా చూపించాడు మహేష్. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఆడియో డేట్ ఫిక్సవడం ఆలస్యం.. వరుసగా ప్రతి రోజూ సినిమాకు సంబంధించి ఏదో ఒక విశేషంతో అభిమానుల్ని పలకరిస్తూనే ఉంది ‘బ్రహ్మత్సవం’ టీమ్.

మోషన్ పోస్టర్ తో పాటు చాలా కలర్ ఫుల్ గా ఉన్న కొత్త పోస్టర్లు సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఆ తర్వాత మధురమే మధురమే పాట టీజర్ వచ్చింది. ఆపై ‘వచ్చింది కదా అవకాశం’ పాట లిరిక్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడిక ఆడియో విడుదలకు రెండు రోజుల ముందే.. గురువారం నాడు ఇంకొన్ని పాటల ప్రోమోలు రిలీజ్ చేయబోతున్నారట.

ఈ ప్రోమోలన్నీ చాలా కలర్ ఫుల్ గా ఉంటాయని చెబుతున్నారు. ఇక ఆడియో విడుదలయ్యాక ఎలాగూ ఆ సందడి ఓ వారమైనా ఉంటుంది. ఆపై విడుదలకు ముందు వారమంతా మహేష్ బాబు సహా యూనిట్ సభ్యులంతా సినిమాను ప్రమోట్ చేస్తారు. ఇలా అభిమానులకు ఏమాత్రం ఊపిరి తీసుకునే అవకాశమివ్వకుండా మంచి ప్రమోషనల్ ప్లాన్ తో రెడీ అయి ఉన్నాడు మహేష్.