Begin typing your search above and press return to search.

భయం కాదు, బాహుబలి ఆడాలని -మహేష్‌

By:  Tupaki Desk   |   25 Jun 2015 9:10 AM GMT
భయం కాదు, బాహుబలి ఆడాలని -మహేష్‌
X
మీరు బాహుబలి సినిమాకు భయపడి శ్రీమంతుడు రిలీజ్‌ను వెనక్కి నెట్టేశారా అనే ప్రశ్నకు స్ట్రయిట్‌గా సమాధానం చెప్పేశాడు మహేష్‌ బాబు.

''బాహుబలి అనేది ఓ పెద్ద సినిమా. దానిని చూసి మనమందరం ప్రౌడ్‌గా ఫీలవ్వాలి. అలాంటి సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ అవ్వడం ఎంతో ముఖ్యం. ఆ సినిమా తేడాపడితే ప్రభావం అందరిపైనా పడుతుంది'' అంటూ బాహుబలి గురించి మనస్సులోని మాటలను బయట పెట్టాడు. ''బాహుబలి సినిమాకు లాభం చేకూరాలంటే ఓ 3-4 వారాలు గ్యాప్‌ ఉండాల్సిందే. అలా లేకపోతే కష్టం. అత్యంత పెద్ద సినిమా కాబట్టి శ్రీమంతుడును వెనక్కి నెట్టాం. ఆ గ్యాప్‌ మాక్కూడా కావాలి'' అంటూ చెప్పుకొచ్చాడు.

మహేష్‌ బాబు చెప్పింది కరక్టే. బాహుబలి, రుద్రమదేవి వంటి భారీ బడ్జెట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాలకు హీరోలు సైడ్‌ ఇస్తేనే బెటర్‌. అలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు ఇండస్ట్రీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఆ సినిమాల కోసం గ్యాప్‌ ఇస్తే ఇక అభిమానులు వాటిని భయం, గాడిద గుడ్డూ అని చెప్పుకుంటే ఎలా? ఇకనైనా అలాంటి క్రిటిసిజం మానేస్తే బెటర్‌.