Begin typing your search above and press return to search.

మహేష్ ను ప్రత్యేక హోదా మీద అడిగితే..

By:  Tupaki Desk   |   28 April 2018 11:42 PM IST
మహేష్ ను ప్రత్యేక హోదా మీద అడిగితే..
X
గత ఏడాది జల్లికట్టు మీద ఉద్యమం మొదలైనపుడు తమిళ సినీ పరిశ్రమ ఎలా ఏకతాటిపై నిలబడి పోరాడిందో తెలిసిందే. ఇటీవల కావేరీ జల వివాదం మీద కూడా అదే స్థాయి పోరాటం నడుస్తోంది. కానీ మన తెలుగు సినీ ప్రముఖులు మాత్రం ప్రత్యేక హోదా మీద పోరాటంలో భాగస్వాములు కావడానికి ఇష్టపడట్లేదు. రోడ్డు మీదికొచ్చి పోరాటాలు చేయడం సరే.. కనీసం సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. అసలెక్కడా ఈ అంశం మీద నోరు విప్పట్లేదు. నిరుడు జల్లికట్టు ఉద్యమానికి మద్దతు తెలిపిన మన హీరోలు.. మన తెలుగు వాళ్ల భవిష్యత్తుతో ముడిపడ్డ అంశం మీద మాత్రం నోరు మెదపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ జాబితాలో మహేష్ బాబు కూడా ఉన్నాడు. అతను జల్లికట్టుపై స్పందించాడు. కానీ ఇప్పుడు మౌనం పాటిస్తున్నాడు.

తాజాగా ‘భరత్ అనే నేను’ సక్సెస్ మీట్లో పాల్గొనేందుకు తిరుపతికి వచ్చిన అతడికి మీడియా వాళ్లు తగిలారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రశ్నలు సంధించారు. కానీ అతను సమాధానం ఇవ్వలేదు. ఆ ప్రశ్నలు మినహాయించి మిగతా వాటికే బదులిచ్చాడు. ఐతే ఈ సందర్భంగా మహేష్ ను ఆదుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల. మహేష్ మరోసారి.. ఇంకా పెద్ద వేదికలో ఆ అంశంపై స్పందిస్తాడని అన్నాడు. విజయవాడలో తన బావ.. ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి పర్యటించినపుడు కూడా రాజకీయాలపై మాట్లాడబోనని తేల్చేశాడు మహేష్. మరి కొరటాల చెప్పిన పెద్ద వేదిక ఏది.. మహేష్ ఎప్పుడు ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తాడు? అయినా ఆ పోరాటానికి నా మద్దతుంటుంది.. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని ఒక మాట అనడానికి ఇంత భయమెందుకో?