Begin typing your search above and press return to search.

మహేష్ చెప్పిన హీరోలు ఎవరో మరి?

By:  Tupaki Desk   |   8 April 2018 6:13 AM GMT
మహేష్ చెప్పిన హీరోలు ఎవరో మరి?
X
భరత్ అనే నేను బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది కాని హీరో మహేష్ బాబు స్పీచ్ మాత్రం ఒక భేతాళ ప్రశ్నను మిగిల్చింది. ఇండస్ట్రీలో తిప్పి కొడితే ఐదారుగురు హీరోలు ఉన్నామంటూ మహేష్ చేసిన కామెంట్స్ మీద ప్రస్తుతం అభిమానుల మధ్య చాలా హాట్ డిస్కషన్ జరుగుతోంది. క్యాజువల్ గా ఏదో నెంబర్ అనేసాడా లేక తన మనసులో ఫలానా వాళ్ళమే పెద్ద హీరోలు అనే అభిప్రాయం ఉందా అనే కోణంలో రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. మహేష్ బాబు మూడో తరం హీరో. ఇది నిజం. రెండో తరం చిరంజీవి-బాలకృష్ణ-వెంకటేష్-నాగార్జున వీళ్ళలో ఎవరు రిటైర్ అయిపోలేదు. తమ స్టార్ స్టేటస్ ని అలాగే కాపాడుకుంటూ ఇప్పటి తరానికి కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. మహేష్ బహుశా వీళ్ళను పక్కన పెట్టి మాట్లాడి ఉండాలి. పోనీ తన సమకాలీకులనే తీసుకుందాం. మహేష్-జూనియర్ ఎన్టీఆర్-ప్రభాస్-రామ్ చరణ్-అల్లు అర్జున్ ఐదుగురు అనుకుంటే సినిమాలు చేయను అని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించాడు కనక మహేష్ ఆ పేరుని పరిగణనలోకి తీసుకున్నాడా లేదా అనేది మహేష్ కి మాత్రమే తెలుసు.

సో నిన్నటి తరాన్ని పక్కన పెట్టి కేవలం ఇప్పుడు తనకు సరిసమానంగా మార్కెట్ ఉన్నట్టు భావిస్తున్న హీరోలను మాత్రమే మహేష్ కౌంట్ చేసాడు అనుకోవాలి. కాని రవితేజ-నాని-రామ్-వరుణ్ తేజ్-సాయి ధరం తేజ్-శర్వానంద్- నిఖిల్ ఇలా చెప్పుకోదగ్గ స్థాయిలో హీరోల లిస్టు ఇంకా పెండింగ్ లో ఉంది. ఇందులో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వరుణ్ తేజ్ ఫిదాతో ఆ ఫీట్ సాధిస్తే రవితేజ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. నాని సంగతి సరేసరి. యావరేజ్ గా ఉందన్న సినిమాతో కూడా ఈజీగా ముప్పై కోట్లు రాబడుతున్నాడు. శర్వానంద్ ని కంటెంట్ ఉన్న సినిమాలో చూపిస్తే తను కూడా తక్కువేమీ కాడని ఎక్స్ ప్రెస్ రాజా-శతమానం భవతి రుజువు చేసాయి. సాయి ధరం తేజ్ స్టార్ అనిపించుకోవడానికి ముందే సుప్రీమ్ తో పాతిక కోట్ల సినిమా ఇచ్చాడు. నిఖిల్ హ్యాపీ డేస్ నుంచి కేశవా దాకా అన్ని సేఫ్ ప్రాజెక్ట్స్. మరి మహేష్ ఇవన్ని కౌంట్ లోకి తీసుకోలేదా అంటే ఇప్పటికి లేదనే ఆన్సర్ కనిపిస్తుంది.

ఎంత స్టార్ పవర్ ఉన్నా బాక్స్ ఆఫీస్ కు లెక్కలు ముఖ్యం. ఎంత ఫాన్స్ సపోర్ట్ ఉన్నా క్రేజ్ ఉన్నా అజ్ఞాతవాసి-స్పైడర్ సినిమాలను ఏవి కాపాడలేకపోయాయి. మరి మహేష్ తన స్పీచ్ లో చెప్పింది జయాపజయాలకు అతీతంగా ఉండే తన లాంటి హీరోల గురించా లేక ఫాన్స్ మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించే ప్రయత్నంలో ఓ నెంబర్ అనేసాడా అనే స్పష్టత మిస్ కావడంతో ఇంత చర్చకు అవకాశం దొరికింది.