Begin typing your search above and press return to search.
సుకుమార్ ని కాదని మహేశ్ మంచిపనే చేశాడా
By: Tupaki Desk | 5 March 2019 3:02 PM GMTసూపర్ స్టార్ మహేశ్ పైకి కన్పించడు కానీ పేద్ద దేశముదురు. కామ్ గా ఉంటాడు కానీ చేసేవన్నీ చేస్తుంటాడు. అలాగే.. సుకుమార్ సినిమాను తన చేతికి మట్టి అంటకుండా తప్పించేశాడు. వివరాల్లోకి వెళ్లే.. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్ తో సినిమా చేయడం లేదని.. తన నెక్స్ట్ ప్రాజెక్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు మహేశ్. దీని వెనుకు మహేశ్ వేసిన పెద్ద స్కెచ్ ఉంది. మొదటిది సుకుమార్ చెప్పిన స్టోరీ మహేశ్ కు నచ్చడం లేదు. ఇప్పుడే ఇంత కన్ ఫ్యూజ్ గా ఉంటే.. రేపు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకెంత కన్ ఫ్యూజ్ గా ఉంటుంది. అన్నింటికి మించి సుక్కు సినిమాలు అంటే మినిమం రెండేళ్లు. క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుకుమార్ కోసం రెండేళ్లు ఇచ్చే పరిస్థితిలో మహేశ్ లేడు. అదీగాక.. సుకుమార్ తో సినిమా తీస్తే హిట్ అవుతుందని నమ్మకం లేదు. పోతే డిజాస్టరే. మంచి సినిమా తీశారు అని పేరొస్తుంది కానీ కలెక్షన్లు రావు. అసలే రెండు ప్లాపుల తర్వాత భరత్ అనే నేనుతో హిట్ వచ్చింది. అందుకే.. హిట్స్ ని కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాడు.
ఇక అనిల్ రావిపూడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుకు బలమైన కారణం ఉంది. అనిల్ రావిపూడి మేకింగ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పక్కా క్లారిటీతో సెట్స్ పైకి వెళ్తాడు. అనుకున్న టైమ్ కే మూవీని రిలీజ్ చేస్తాడు. అన్నింటికి మించి అనిల్ కు ఇప్పటివరకు ఫ్లాపులు లేవు. మామూలు కథని కూడా తన కామెడీ టైమింగ్ తో హిట్ చేస్తాడు. ఒకవేళ ఏదైనా తేడా జరిగినా సినిమా యావరేజ్ అవుతుంది తప్ప.. సుకుమార్ సినిమాల్లా ఫ్లాప్ అవ్వదు. ఇవన్నీ ఆలోచించాడు కాబట్టే.. సుకుమార్ సినిమాను పక్కనపడేసి.. అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.