Begin typing your search above and press return to search.

మహేష్ కొత్త లుక్ చూపిస్తాడా?

By:  Tupaki Desk   |   1 Jun 2018 8:21 AM GMT
మహేష్ కొత్త లుక్ చూపిస్తాడా?
X
ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో స్పోర్ట్స్ పర్సన్ - కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్టార్ట్ చేసిన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ మన స్టార్లను బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్యాంపెయిన్ కు నామినేట్ అయిన హీరో హీరోయిన్లంతా జిమ్ లో వాళ్ల ఫేవరెట్ వర్కవుట్స్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా మళయాళ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్ ను నామినేట్ చేశాడు.

మోహన్ లాల్ నామినేషన్ కు తారక్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. ఫిట్ నెస్ కాపాడుకునేందుకు తాను చేసే ఎక్సర్ సైజులు ఏంటో అభిమానులకు షేర్ చేశాడు. తరవాత ఈ ఛాలెంజ్ కు మహేష్ బాబు పేరు నామినేట్ చేశాడు. ఇంకా దీనికి మహేష్ స్పందించాల్సి ఉంది. భరత్ అనే నేను సినిమా తరవాత మహేష్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మహేష్ ఓ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇందుకోసం అల్రెడీ స్టయిల్ మార్చే పనిలో పడ్డాడు. మహేష్ లాంగ్ హెయిర్ తో ఉన్న ఫొటోను ఇప్పటికే నమత్ర షేర్ చేసింది.

వీలైనంత వరకు క్లీన్ షేవ్ తో కనిపించే మహేష్ ఈ మూవీలో గడ్డంతో కనిపించనున్నాడనే టాక్ ఉంది. ఆ గెటప్ లో ఎలా ఉంటాడా అనేదానిపై ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ బాగానే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే మహేష్ కొత్త లుక్ ఎలా ఉందనేది తెలుస్తుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.