Begin typing your search above and press return to search.

ప్లాప్ దర్శకుడి సుడిని మహేశ్ అలా తిప్పేశాడట!

By:  Tupaki Desk   |   15 Jan 2020 5:46 AM GMT
ప్లాప్ దర్శకుడి సుడిని మహేశ్ అలా తిప్పేశాడట!
X
కొన్నిసార్లు అంతే. ఎంత అనుకున్నా కలిసిరాదు. ఏం చేసినా చేయి కాల్చుకోవటమే అవుతుంది. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న ప్లాప్ దర్శకుడు ఒకరి సుడి ఒక రేంజ్లో తిరిగిపోయిందని చెబుతున్నారు. ఇంతకీ ఈ ప్లాప్ దర్శకుడు ఎవరు? ఆయనకు మహేశ్ కు లింకేమిటి? ఆయన సుడి ఎలా తిరిగిందన్న సందేహాలు వస్తున్నాయా? అక్కడికే వస్తున్నాం.

మొహర్ రమేశ్ పేరు గుర్తుందా? కన్నడంలో మంచి హిట్లు ఇచ్చిన దర్శకుడిగా పేరున్న ఆయన.. టాలీవుడ్ కు ఏ ముహుర్తంలో ఎంట్రీ ఇచ్చారో కానీ.. ఆయనకు ఎదురైన వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆయనతో సినిమాలు చేయటానికి హీరోలు దగ్గరకు రాని పరిస్థితి. దీంతో టాలీవుడ్ లో ఆయన పేరే వినిపించట్లేదు. ఇలాంటి వేళ.. మహేశ్ బాబు పుణ్యమా అని ఆయన పేరు ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది.

చిన్న చిన్న ప్రకటనలు చేసుకుంటూ కాలం గడుపుతున్న మొహర్ రమేశ్ తాజాగా సినిమా డిస్ట్రిబ్యూటర్ అవతారం ఎత్తారు. మహేశ్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి గుంటూరు జిల్లా రైట్స్ దక్కించుకున్నారు. అడ్వాన్సుల రూపంలో రాబట్టిన మొత్తం ఆయన పెట్టుబడి మొత్తం కాగా.. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లటం.. పండుగ కారణంగా కలెక్షన్లు అదిరిపోతుండటంతో.. ఇప్పుడొస్తున్న వసూళ్లు మొత్తం లాభమేనని చెబుతున్నారు.

డిస్ట్రిబ్యూటర్ గా తొలిసారే మహేశ్ చిత్రం కావటం.. అది కాస్తా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవటంతో మెహర్ రమేశ్ సుడి తిరిగిపోయిందంటున్నారు. మరి.. మహేశ్ చిత్రంతో వచ్చిన సొమ్ముల్ని ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.