Begin typing your search above and press return to search.
మహేష్ నీతులు సినిమాకే సరి!!
By: Tupaki Desk | 5 April 2018 5:50 AM GMTమహేష్ బాబు తన సినిమాలను ప్రచారం చేసుకోవడంలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అసలు టాలీవుడ్ లోనే ప్రచారంకు ఉన్న ప్రాధాన్యత గుర్తించిన తొలి స్టార్ హీరో మన సూపర్ స్టార్. సినిమా రేంజ్ ను పెంచడానికి పబ్లిసిటీ ఎంతగా ఉపయోగపడుతుందో మహేష్ కు తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదేమో. ఇంటర్వ్యూలు ఇవ్వడం.. మీడియాలో కనిపించడం మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తుంటాడు.
అలాగే తన సినిమా రిలీజ్ కు ముందు.. కనీసం ఓ 40-50 ట్వీట్లు వేస్తాడు మహేష్. స్పైడర్ విషయంలో అయితే హాఫ్ సెంచరీని దాటిపోయింది ట్వీట్స్ సంఖ్య. అంతే కాదు.. మన తెలుగు జనాలకు అంతగా లింక్ లేని జల్లికట్టు మీద ట్వీట్లు వేసిన హిస్టరీ ఉంది. ఇది కూడా తమిళ్ స్పైడర్ కోసమే చేశాడనే విమర్శలున్నాయి. అంతే తప్ప.. ఇప్పుడు ఏపీకి స్పెషల్ స్టేటస్ మీద ఒక్క ట్వీట్ అయినా పెడతాడా అంటే మాత్రం.. అక్కడ సైలెంట్ గానే ఉంటాడు సూపర్ స్టార్. అయినా ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద తెలంగాణ లీడర్లే పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. కానీ మహేష్ మాత్రం ఇక్కడ సైలెంటే.
అంతే కాదు.. భరత్ అను నేను అంటూ పొలిటికల్ నీతులు చెప్పేందుకు కూడా రెడీ అయ్యాడు సూపర్ స్టార్. రియల్ లైఫ్ లో రాజకీయాలకు మాత్రమే కాదు.. జనాలు పోరాడుతున్న అంశం మీద సైలెన్స్ పాటిస్తూ.. రీల్ లైఫ్ లో నీతులు చెబితే.. జనాలకు కిక్కిస్తుందా? అన్నదే ఆలోచించాల్సిన విషయం.