Begin typing your search above and press return to search.

పవన్ లాగా చేస్తావేంటి మహేష్..

By:  Tupaki Desk   |   10 Jan 2018 4:57 AM GMT
పవన్ లాగా చేస్తావేంటి మహేష్..
X
మహేష్ బాబు కెరీర్ ఏమంత బాగా లేదు కొన్నేళ్లుగా. గత నాలుగేళ్లలో ఒక్క ‘శ్రీమంతుడు’ మినహాయిస్తే మహేష్ సినిమాలన్నీ డిజాస్టర్లే. ఇప్పుడతడి కెరీర్‌ కు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా చాలా చాలా కీలకం. ఈ సినిమా షూటింగ్ మొదలై ఐదారు నెలలైంది. నిజానికి సంక్రాంతికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుని వేసవికి వాయిదా వేశారు. ఐతే ఇప్పటిదాకా ఈ చిత్ర టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ లాంచ్ చేయలేదు. ఇంకే విశేషాన్నీ పంచుకోలేదు. ఈ చిత్రానికి ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ అదేమీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ కూడా రావట్లేదు ఈ మధ్య.

మరోవైపు వేసవి బరిలోనే ఉన్న ‘నా పేరు సూర్య’ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. మొన్న జనవరి 1కి రిలీజ్ చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ అదిరిపోయిందన్న టాక్ వచ్చింది. కానీ మహేష్ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా ఏ ముచ్చటా లేదు. చూస్తుంటే.. ‘అజ్ఞాతవాసి’కి పవన్ కళ్యాణ్ ఫాలో అయిన రూటునే మహేష్ కూడా అనుసరిస్తాడేమో అనిపిస్తోంది. రిలీజ్ ముంగిట ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్ లాంటివి లాంచ్ చేస్తారేమో. ఐతే ‘అజ్ఞాతవాసి’ రిలీజవుతున్న టైమింగ్ వేరు. దానికి కలిసొచ్చిన అంశాలు వేరు. మహేష్ సినిమా సంగతి అలా కాదు. అది వేసవిలో ‘2.0’.. ‘నా పేరు సూర్య’.. ‘రంగస్థలం’ లాంటి సినిమాల మధ్య రాబోతోంది. అలాంటపుడు కొంచెం ముందు నుంచే ప్రమోషన్ల హోరు పెంచి బజ్ తీసుకురావడం ముఖ్యం. మరి మహేష్ టీం ఆలోచన ఏంటో కానీ.. కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగినట్లు సంక్రాంతికి కూడా అతడి కొత్త సినిమా విశేషమేదీ పంచుకునే అవకాశాల్లేవని సమాచారం.