Begin typing your search above and press return to search.

మహేష్-ఇంద్రగంటి.. సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   21 Jun 2018 10:49 AM IST
మహేష్-ఇంద్రగంటి.. సాధ్యమేనా?
X
దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన సమ్మోహనం.. ప్రేక్షకులను కూడా బాగానే సమ్మోహితులను చేస్తోంది. అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ మూవీ.. ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కును దాటేసి.. బ్లాక్ బస్టర్ రేంజ్ ను మించిపోతోంది.

సుధీర్ బాబు తో పాటు అదితి రావు హైదరికి కూడా మంచి విజయాన్ని అందించిన ఇంద్రగంటి మోహన కృష్ణకు.. ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు.. కృతజ్ఞతలు తెలపడంతో పాటు.. సినిమా ప్రచారంలో పాలుపంచుకున్న వారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాడు ఇంద్రగంటి. ఇప్పటివరకూ స్టార్ హీరోలతో సినిమా చేయలేదు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈ లోటు కూడా తీరిపోయే అవకాశం కనిపిస్తోంది. తాజాగా మహేష్ బాబు కూడా ఇంద్రగంటి కూడా ఆరా తీయడం చర్చనీయాంశం అవుతోంది.

సుధీర్ బాబుతో పిచ్చాపాటీగా మాట్లాడిన మహేష్.. ఇంద్రగంటి మేకింగ్ స్టైల్ గురించే అరగంటకు పైగా చర్చలు నిర్వహించాడట. కొన్ని రోజుల క్రితం ఇంద్రగంటి మోహనకృష్ణతో.. మహేష్ భార్య నమ్రతా చాలా సేపు చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. మహేష్ తో సినిమా చేసే అవకాశాలపై కూడా ఆమె ప్రతిపాదనను చెప్పిందట. దీనికి ఇంద్రగంటి కూడా ఆసక్తి చూపినట్లు చెబుతున్నారు. స్టోరీ ఓకే అయితే మాత్రం.. ఈ క్రేజీ కాంబో సాధ్యమయ్యే అవకాశాలున్నాయి.