Begin typing your search above and press return to search.

మహేష్ - త్రివిక్రమ్ కాంబోపై అప్పుడే రూమర్స్ పుట్టుకొచ్చాయిగా...!

By:  Tupaki Desk   |   9 Oct 2020 1:15 PM IST
మహేష్ - త్రివిక్రమ్ కాంబోపై అప్పుడే రూమర్స్ పుట్టుకొచ్చాయిగా...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతి త్వరలో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. 'ఖలేజా' సినిమా పదేళ్లు పూర్తయినా సందర్భంగా మహేష్ ట్వీట్ చేస్తూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. దీంతో అభిమానులు వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రానుందని ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మహేష్ నుంచి స్పష్టత వచ్చింది కానీ త్రివిక్ర‌మ్ నుంచి మరియు త‌న హోమ్ బ్యాన‌ర్ నుంచి కానీ ఇంత‌వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనికి కారణం ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా అనే టాక్ వినిపిస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అనే దానిపై క్లారిటీ లేదు. ఇక ట్రిపుల్ ఆర్ లో తారక్ తన షూట్ కంప్లీట్ చేసి ఎప్పుడు త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తాడు అనేది చెప్పలేని పరిస్థితి. దీంతో ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేయ‌డానికి త్రివిక్రమ్ కి కాస్త టైమ్ పడుతుందని అర్థం అవుతుంది. దీని తర్వాతే మహేష్ సినిమా గురించి క్లారిటీ ఇవ్వాల‌ని త్రివిక్రమ్ నిర్ణయించున్నాడట. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న మహేష్.. త్రివిక్రమ్ కోసం అప్పటి వరకు వెయిట్ చేస్తాడో లేదో చూడాలి.

ఇదిలా ఉండగా మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ఓ మల్టీస్టారర్ అని ప్రచారం జరుగుతోంది. ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో మల్టీస్టారర్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన మహేష్ మరోసారి ఇంకో స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. అయితే ఈ సినిమా స్టోరీ విషయంలో అప్పుడే సోషల్ మీడియాలో ఓ న్యూస్ సర్క్యూలేట్ అవుతోంది. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు - జగ్గయ్య కాంబోలో వచ్చిన 'ప్రాణమిత్రులు' తరహా సబ్జెక్ట్ అని అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ పాత సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టోరీ రెడీ చేస్తారనే అపవాదు ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. 'అల వైకుంఠపురంలో' మూవీ కూడా 'ఇంటిగుట్టు' అనే సినిమాకి ప్రేరణ అనే కామెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలానే 'అ ఆ' సినిమా 'మీనా' సినిమాకి ఇన్స్పిరేషన్ అని త్రివిక్రమ్ స్వయంగా ప్రకటించారు. మరి ఇప్పుడు మహేష్ తో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.