Begin typing your search above and press return to search.

మహేష్ ముంబై వెళ్లింది అందుకేనా?

By:  Tupaki Desk   |   12 Jun 2018 5:23 PM GMT
మహేష్ ముంబై వెళ్లింది అందుకేనా?
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి భరత్ అనే నేను తో పికప్ అయ్యాడు. వచ్చే సినిమాలతో తన అసలైన బాక్స్ ఆఫీస్ రుచిని చూపించాలని ట్రై చేసున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే మహేష్ స్పైడర్ సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కానీ అనుకున్నంత రేంజ్ లో మన సూపర్ స్టార్ క్లిక్ అవ్వలేదు. ఇక ఎప్పటినుంచో మహేష్ బాలీవుడ్ లో ట్రై చేయాలని చూస్తున్నాడు. మంచి ప్రాజెక్ట్ దొరికితే అక్కడ కూడా ఆదరగొట్టాలని అనుకుంటున్నాడు. ముంబై లో అప్పుడప్పుడు కొన్ని ప్రొడక్షన్స్ తో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా కూడా మహేష్ పారిస్ ట్రిప్ వెసొచ్చిన తరువాత ముంబై లో ఒకరోజు ఉండి వచ్చాడు. అక్కడ నమ్రత కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నార్మల్ గా వెళుతుండడం అలవాటే కానీ ఇటీవల మాత్రం సినిమాకు సంబంధించిన విషయం గురించి మహేష్ వెళ్లినట్లు తెలుస్తోంది.

మహేష్ రీసెంట్ గా గెడ్డం లుక్ తో ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు కదా.. అదే రోజు బాలీవుడ్ దర్శకులను కూడా కలిసినట్లు సమాచారం. ఇక మహేష్ ఎంత చర్చలు జరిపినా కూడా నమ్రత నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో ఆమె పాత్ర తప్పకుండా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. మరి మహేష్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కోసం మహేష్ సరికొత్త లుక్ మెయింటైన్ చేస్తున్నాడు.