Begin typing your search above and press return to search.

మహేష్‌తో అంత వీజీ కాదు జక్కన్నా!

By:  Tupaki Desk   |   15 July 2015 3:29 PM IST
మహేష్‌తో అంత వీజీ కాదు జక్కన్నా!
X
మహేష్ బాబుతో రాజమౌళి.. కల లాంటి కాంబినేషన్ ఇది. ఎప్పట్నుంచో అభిమానులు ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ ఇంకో ఏడాది తర్వాత కార్యరూపం దాల్చవచ్చు . ఈ సినిమా ఉంటె గనుక ఎలా ఉండొచ్చో అని అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఐతే రాజమౌళి ఇప్పటిదాకా పని చేసిన హీరోలతో పోలిస్తే మహేష్‌తో చేయడం కొంచెం కష్టమైన వ్యవహారమే.

రాజమౌళి ఇప్పటిదాకా ఆరుగురు హీరోలతో పని చేశాడు. ఆ ఆరుగురిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్ మాత్రమే పెద్ద స్టార్లు. రామ్ చరణ్ మగధీర తరువాతనే పెద్ద స్టార్ గా ఎదిగాడు , రవితేజ రాజమౌళితో సినిమా చేసే సమయానికి మీడియం రేంజి హీరోనే. నితిన్‌ కూడా రాజమౌళితో సినిమా చేసే సమయానికి అప్‌కమింగ్ హీరోనే. ఇక సునీల్, నానిల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఐతే ఈ ఆరుగురు హీరోలు కూడా రాజమౌళితో సినిమా చేస్తున్నపుడు అతడి చేతుల్లోకి వెళ్లిపోయారు. స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లు సైతం అతడికి తమను తాము అప్పగించేసుకున్నారు. ఎవరి ఇమేజ్ కూడా రాజమౌళికి అడ్డంకిగా మారలేదు. సినిమాలు విడుదలైనపుడు అవి రాజమౌళి సినిమాలుగా స్టాంప్ వేసుకున్నాయి..

ఐతే మహేష్ సంగతి అలా కాదు. ప్రభాస్ తో బాహుబలి కంటే ముందు చత్రపతి చేసాడు, ఎన్టీఆర్ తో యమదొంగ కంటే ముందు స్టూడెంట్ లీడర్, సింహాద్రి సినిమాలు చేసారు, కాని మహేష్ తో చేస్తే కనుక ఇదే మొదటి సినిమా దర్శకుడిగా రాజమౌళితో సమానంగా హీరో ఇమేజ్ కలిగినవాడు. ఇప్పటిదాకా అతడితో కలిసి పని చేయలేదు. దర్శకులతో మహేష్‌కు ఇగో క్లాషెస్ వచ్చిన సందర్భాలేమీ లేవు కానీ.. త్రివిక్రమ్, శ్రీను వైట్ల లాగా తనతో బాగా ట్యూన్ అయిన డైరెక్టర్లతో అతను సౌకర్యంగా కనిపించాడు.

మరి రాజమౌళితో ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇప్పటిదాకా తన ఇమేజ్‌ను స్టార్ ఇమేజ్ డామినేట్ చేసే పరిస్థితి రాజమౌళికి రాలేదు. మహేష్ తో మూవీ ఉంటె కనుక తొలిసారి ఆ పరిస్థితి ఉంటుంది. మరి అంత ఇమేజ్‌ను ఉన్న హీరోను జక్కన్న ఎలా డీల్ చేస్తాడో.. మహేష్‌ ఇమేజ్‌ను, తన ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఎలా సినిమా తీస్తాడు అన్నది ఆసక్తికరం. ఈ విషయంలో జక్కన్నకు తొలిసారి సవాలు ఎదురవబోతున్న మాట వాస్తవం.