Begin typing your search above and press return to search.

మహేష్ పిలిచాడంటే జాక్ పాటే

By:  Tupaki Desk   |   8 May 2019 9:56 AM IST
మహేష్ పిలిచాడంటే జాక్ పాటే
X
ఇటీవలే జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో ఇకపై తాను ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే కథలు ఒప్పుకుంటానన్న మహేష్ మొత్తానికి అదే రూట్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజా అప్ డేట్ ప్రకారం గత ఏడాది గీత గోవిందం రూపంలో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు పరశురామ్ తో చేసేందుకు ప్రిన్స్ ఆసక్తి చూపిస్తున్నాడట.

ఇటీవలే జరిగిన కలయికలో పరశురామ్ చెప్పిన లైన్ ఇంప్రెస్ చేయడంతో ఫుల్ వెర్షన్ తో రమ్మని ఒకవేళ నచ్చితే అనిల్ రావిపూడి తర్వాత ఇదే చేద్దామని కూడా చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. వాస్తవానికి పరశురామ్ గీత ఆర్ట్స్ కు కమిట్ అయ్యాడు. అదే బ్యానర్ లో మరో సినిమా చేయాలి

మరోవైపు అల్లు అరవింద్ కూడా మహేష్ సినిమా చేసే ప్లాన్ లో ఎప్పటి నుంచో ఉన్నారు. సరైన కథ దర్శకుడు దొరక్క ఇన్నాళ్లు ఆగారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ ను సెట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే అరవింద్ స్వయంగా పరశురామ్ ను పంపినట్టు తెలిసింది. ఫైనల్ హియరింగ్ లో కనక మహేష్ కన్విన్స్ అయితే గీత సంస్థ నిర్మాణంలో ఇది రూపొందే ఛాన్స్ ఉంది. అయితే సూపర్ స్టార్ కు కథ నచ్చితేనే సుమా.

ఇది పరశురామ్ కు ఛాలెంజ్ లాంటిదే. ఇప్పటిదాకా మీడియం రేంజ్ హీరోలతోనే డీల్ చేసిన అతనికి ఏకంగా మహేష్ తో మూవీ అంటే జాక్ పాట్ కాక మరేమిటి. అందుకే అనిల్ రావిపూడి షూటింగ్ సగం అయ్యే లోపు మొత్తం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ప్రిన్స్ ని కలిసే ప్లాన్ లో ఉన్నాడని ఫిలిం నగర్ టాక్