Begin typing your search above and press return to search.

అయ్యో.. మహేష్‌ మిస్సయ్యాడుగా..

By:  Tupaki Desk   |   6 May 2016 5:24 PM IST
అయ్యో.. మహేష్‌ మిస్సయ్యాడుగా..
X
అబ్బబ్బా.. ఏం సినిమా అండీ.. ఇది మన సూపర్‌ స్టార్‌ చేసుంటే ఎలా ఉండేది? ఇప్పటివరకు తెలుగువారు అలా కొన్ని సినిమాల గురించి ఫీలయ్యే ఉంటారు. ఉదాహరణకు.. పవన్ కళ్యాణ్‌ 'గజిని' సినిమాను రీమేక్‌ చేసుంటే మైండ్ బ్లోయింగ్‌ గా ఉండేదని తెలుగులో సూర్య సినిమాను చూసినప్పుడు చాలామంది ఫీలయ్యారు. మరి రీమేక్‌ కోసం ఆల్రెడీ తీసిన తమిళ సినిమాను చూపించినా.. అప్పట్లో పవన్‌ కు కనక్ట్ కాలేదు. ఇప్పుడు మహేష్‌ విషయంలో కూడా అలాంటిదే చోటుచేసుకుంది.

''మనం'' సినిమా హిట్టయ్యాక.. దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ వెంటనే మహేష్‌ బాబును కలసి.. ఈ ''24'' సినిమా కథ చెప్పాడట. ఫుల్లుగా డెవలప్‌ చేసుకుని రమ్మని చెప్పిన మహేష్‌.. తీరా మొత్తంగా కథ రాశాక.. తనకు కిక్‌ రావట్లేదు అన్నాడు. దానితో ఆ కథను హీరో సూర్యకు వినిపించాడు విక్రమ్‌. ఇంకేముంది వెంటనే ప్రాజెక్టు మొదలైపోయింది. అయితే ఇప్పుడు రిజల్టు చూశాక ఎమేజింగ్‌ గా ఉంది. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులందరూ.. ఇలాంటి సినిమా మన మహేష్‌ చేసుంటేనా.. అని ఫీలవ్వక మానరు. ఒకవేళ మహేష్‌ చేసుంటే మాత్రం.. మూవీ రేంజ్‌ ఖచ్చితంగా ఇంకో రేంజులో ఉండేదని చెప్పొచ్చు.

ఇకపోతే సూర్య కూడా మైండ్‌ బ్లోయింగ్‌ గా చేశాడులే. మూడు రోల్స్‌ లో మనోడు మెరిసిపోయి మనల్ని మురిపించాడు.