Begin typing your search above and press return to search.

మహేష్ అప్పుడేం చేస్తాడో..?

By:  Tupaki Desk   |   30 Jun 2015 4:13 PM IST
మహేష్ అప్పుడేం చేస్తాడో..?
X
అగ్ర హీరో, దర్శకుల సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధమయినపుడు ఒకరికొకరు సహకరించుకోవడం సినీ పరిశ్రమలో సర్వ సాధారణం. కోట్లు పెట్టుబడికి నష్టం వాటిల్లకుండా కనీసం ఒక వారం వ్యవధి ఉండేలా చూసుకుంటారు. టాలీవుడ్ అగ్ర హీరో అయిన మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి కలల సినిమా బాహుబలి కోసం శ్రీమంతుడు సినిమాని వెనుకకు జరిపిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు నిర్మాణాంతర పనులు పూర్తి కాలేదన్నది వాస్తవమే అయినా విడుదలనాటికి పూర్తి చేసే అవకాశమైతే వుంది. ఈ సినిమా వరకూ మహేష్ నిర్ణయం సరే అనుకున్నా ఇదే సీన్ రీపీట్ అయితే...?

ఏడేళ్ళ తర్వాత చిరు సినిమా చేస్తున్నారు. అదీ ప్రతిష్టాత్మక 150వ సినిమా. ఆగస్ట్ లో మొదలుకానున్న ఈ సినిమా సంక్రాంతి విడుదల అని అనుకుంటున్నారు. పూరి స్పీడ్ కి 4 నెలల సమయం చాలా ఎక్కువ కూడా. జూలై 10న షూటింగ్ ప్రారంభం కానున్న మహేష్ బ్రహ్మోత్సవం 2015 జనవరి 8న విడుదల అనే కార్డ్ కూడా వేసేశారు. చిరు అక్కడికి కొద్ది రోజులు అటుఇటుగా వస్తారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే చిత్రం కనుక బాహుబలికి పోటీ ఇవ్వని మహేష్ కమర్షియల్ సినిమాకి కొలతలు లేవంటారో లేదా నిర్ణయం మార్చుకుంటారో చూడాలి. కాసేపు మహేష్ సంగతి పక్కన పెడితే మేనల్లుడు బన్నీ బోయపాటి సినిమాతో మామకు పోటీ ఇచ్చేలానే వున్నాడు. చిరు అంటే బన్నీకి బోలెడంత అభిమానం వున్నమాట నిజమే అయినా సినిమాల పండగకి పెద్ద సీజన్ సంక్రాంతి. సీజన్ ముందు అభిమానం నిలబడుతుండా అనేది ప్రశ్నార్థకమే..!