Begin typing your search above and press return to search.

ఈసారైనా మహేష్‌ కు ఫోన్‌ చేస్తారా?

By:  Tupaki Desk   |   15 May 2016 9:43 AM IST
ఈసారైనా మహేష్‌ కు ఫోన్‌ చేస్తారా?
X
''శ్రీమంతుడు'' సినిమా అంత పెద్ద హిట్టతయితే.. కేవలం తెలుగు ఇండస్ర్టీ నుంచి రామ్‌ చరణ్‌ ఒక్కడే ఫోన్‌ చేసి సినిమా బాగుందని చెప్పాడని అప్పట్లో మహేష్‌ బాబు రివీల్‌ చేశాడు. ఆ దెబ్బకి అందరూ షాకైపోయారు. ఏదో బయటకు ''మేము సైతం'' అంటూ తెగ చేతులు కలిపేసుకునే మన స్టార్లు.. సినిమాలు హిట్టయ్యాక మాత్రం కనీసం అభినందించుకోరా అంటూ అందరూ ఖంగుతిన్నారు.

ఇప్పుడు అందరూ ఎదురు చూస్తోంది.. మహేష్‌ ''బ్రహ్మోత్సవం'' గురించే. ఈ సినిమా కూడా ఒక మాంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ట్రైలర్‌ చూస్తే అర్ధమైపోతోంది. మనకు అందుతున్న ఎక్స్ క్లూజివ్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రకారం.. కొన్ని సెంటిమెంటల్‌ సీన్లు.. వాటిలో మహేష్‌ యాక్టింగ్‌ అదిరిందట. ఇవన్నీ చూస్తే మరి మన స్టార్‌ హీరోల్లో ఎంతమంది ఫోన్లు చేస్తారు? అసలు ఎవరు కాల్‌ చేశారు అనేది చేసినవారు చెప్పకపోయినా.. ఖచ్చితంగా ఇండస్ర్టీ రెస్పాన్స్‌ ఏంటి అని మీడియా మాత్రం అడుగుతుంది. అప్పుడు మహేష్‌ ఎవరు కాల్‌ చేశారో ఖచ్చితంగా చెప్పేస్తాడు. అది సంగతి.

ఒకానొక టైములో మన యాక్టర్లందరూ.. ఒకరి నటనను ఒకరు.. ఒకరి సినిమాలను ఒకరు బాగా అభినందించుకుని పొగుడుకునేవారు. వాతావరణం బాగా హెల్తీగా ఉండేది. ఇప్పుడు అలా లేదని కాదు.. కాని అలా లేదు. డాట్‌