Begin typing your search above and press return to search.
సోడా తాగుతూ కనిపించిన మహేష్
By: Tupaki Desk | 17 April 2018 5:12 PM GMTప్రస్తుత రోజుల్లో సినిమా ప్రమోషన్ సోషల్ మీడియాలా బీభత్సంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఒకప్పుడు జనాలు కేవలం వాల్ పోస్టర్లు చూసే వచ్చే వారు. గోడ మీద ఉండే పోస్టర్లకు ఉండే క్రేజ్ చాలా వేరు. అప్పట్లో స్టార్ హీరోల పోస్టర్స్ కి దండలు కూడా పడేవి. అభిమానులకు అదో ఆనందం. చూసినోళ్లు అరగంట అలానే చూస్తూనే ఉండేవారు. అయితే ఈ రోజుల్లో ఎక్కువగా పోస్టర్స్ కనిపించడం లేదు.
హోర్డింగ్స్ లేదా కటౌట్స్ మాత్రమే కొంచెం ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అది కూడా థియేటర్స్ దగ్గరే. ఇక ఆ విషయం పక్కనపెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న భరత్ అనే నేను సినిమా పోస్టర్స్ కూడా అక్కడక్కడా బాగానే కనిపిస్తున్నాయి. అయితే మాస్ ఏరియాల్లో చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్స్ ని సెట్ చేసింది. అక్కడి వారికి నచ్చే విధంగా లో లెవెల్లో ప్రజెంట్ చేశారు. ఒక పోస్టర్ లో అయితే మహేష్ బాబు సోడా తాగుతూ సింపుల్ గా కనిపించాడు.
అభిమానులకు ఆ పోస్టర్ చాలా కనెక్ట్ అయ్యిందని చెప్పాలి. కేక అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాల్ పోస్టర్ ని ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ ప్లాన్ గట్టిగా వేసింది. నిర్మాత డివివి.దానయ్య ప్రమోషన్స్ కోసం దాదాపు 3 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అంటే ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.