Begin typing your search above and press return to search.

సెకండ్ లుక్: మహర్షి సీఈవో అవతారం

By:  Tupaki Desk   |   31 Dec 2018 1:40 PM GMT
సెకండ్ లుక్: మహర్షి సీఈవో అవతారం
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 5 న ప్రేక్షకులముందుకు రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మహేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25 వ చిత్రం కావడం ఒక విశేషం. తాజాగా 'మహర్షి' టీమ్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

'మహర్షి' సినిమానుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ టీజర్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వాటిలో మహేష్ కాలేజి స్టూడెంట్ గా గడ్డంతో యంగ్ అండ్ ఛార్మింగ్ లుక్ లో కనిపించాడు. తాజాగా విడుదల చేసిన సెకండ్ లుక్ లో పూర్తిగా డిఫరెంట్ గెటప్ లో కనిపించడం విశేషం. ఈ సినిమాలో మహేష్ విభిన్న షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నాడు. కాలేజి స్టూడెంట్ గా అమెరికాలో ఒక కార్పొరేట్ కంపెనీకి సీఈవోగా ఒక గ్రామంలో రైతుగా కనిపిస్తాడు. కొత్త పోస్టర్ లో మహేష్ క్లీన్ షేవ్ తో సూటు బూటులో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని డాషింగ్ లుక్ లో కనిపించాడు. ఇదే సీఈవో గెటప్ అని చెప్పనవసరం లేదు కదా. మహేష్ అలా స్టైల్ గా వర్షంలో నడుచుకుంటూ వస్తుంటే వెనక ఒక ఫారెన్ అసిస్టెంట్ మహేష్ తడవకుండా గొడుగు పట్టుకున్నాడు. ఈ పోస్టర్ లోనే 'హ్యాపీ న్యూ ఇయర్ 2019' అంటూ 'మహర్షి' విషెస్ తెలిపాడు.

ఫస్ట్ లుక్ లో కాలేజ్ స్టూడెంట్ గా ఎంతగా మెప్పించాడో ఇప్పుడు సీఈవో గా అంతకంటే ఎక్కువగా ప్రేక్షకులను తన లుక్ తో మహేష్ క్లీన్ బౌల్డ్ చేయడం ఖాయం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవీ శ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. దిల్ రాజు-అశ్వినీ దత్-పీవీపీ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.