Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 25 కాదట.. కొత్త డేట్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   6 March 2019 11:42 AM IST
ఏప్రిల్ 25 కాదట.. కొత్త డేట్ ఫిక్స్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమా మొదట ఏప్రిల్ 5 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ డిలే కావడంతో ఆ విడుదల తేదీని ఏప్రిల్25 కు మార్చారు. కానీ ఆ డేట్ కూడా అందుకోవడం దాదాపు అసాధ్యమని మరో పోస్ట్ పోన్ మెంట్ తప్పదని తర్వాత వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ 'మహర్షి' మేకర్స్ ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందంటూ ఆందోళన చెందుతున్న ఫ్యాన్సును శాంతపరిచారు. వాయిదా లేదని ఎంత చెప్తున్నా మళ్ళీ వాయిదా వార్తలు తెరపైకి వచ్చాయి.

సినిమా షూటింగ్ ఏప్రిల్ 16 వ తేదీకిగానీ పూర్తవదని.. అలాంటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేందుకు.. ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టేందుకు అంత తక్కువ సమయం సరిపోదని అంటున్నారు. దీంతో 25 వ తారీఖు బదులు మే 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

ఏప్రిల్ లో రిలీజ్ హిట్ సెంటిమెంట్ అని భావిస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు ఇది కాస్త నిరాశకలిగించే విషయమే. కానీ సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకోకుండా ఉండడం మంచిదే. ఎందుకంటే మహేష్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ అన్నీ సమ్మర్ లో రిలీజ్ అయినవే. కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉందనే బజ్ విన్పిస్తోంది కాబట్టి మరో సారి మహేష్ బాక్స్ ఆఫీసును ఊపేయడం ఖాయమేననే అంచనాలున్నాయి.