Begin typing your search above and press return to search.
మహేష్ బాబుకి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది
By: Tupaki Desk | 17 July 2015 9:17 AM ISTగత కొద్ది రోజులుగా సూపర్‌స్టార్ మహేష్ బాబు స్విట్జర్‌ల్యాండ్‌లో హాలీడే గడుపుతున్నాడనే విషయం తెలిసిందే. ఇక కట్ చేస్తే ఇండియా తిరిగి రాగానే మనోడు చేసిన మొదటి పనేంటి? ఏముంది.. అందరిలాగానే మహేష్ కూడా ఫినామెనల్ బాహుబలిని చూసేశాడు. చూశాక రియాక్షన్ ఎలా ఉందో తెలుసా?
''గూజ్ బంప్స్.. చాలా గర్వంగా ఉంది.. మన దేశంలోనూ బయటా కూడా ఒక తెలుగు సినిమా ఇలా రికార్డులను కొల్లగొడుతుందని ఎన్నడూ అనుకోలేదు. రాజమౌళి మన ఇండస్ట్రీ వాడైనందుకు చాలా ఆనందంగా ఉంది. కీరవాణి గారు ఎంతో అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఇంతటి గొప్ప చిత్రాన్ని తీసినందుకు ఆర్కా మీడియా వారికి కృతజ్ఞతలు. ప్రభాస్, రానా.. టెరిఫిక్ అంతే. వాళ్ళ కష్టం, డెడికేషన్ ప్రతిఫలించాయి. మీకూ మీ టీమ్‌కు కంగ్రాట్యులేషన్స్ రాజమౌళి...'' అంటూ సెలవిచ్చాడు మహేస్. యథావిథిగా ట్వీట్స్ ద్వారా తన ఫీలింగ్స్‌ను తెలియజేశాడు.
యావత్ భారతదేశానికి తెగ నచ్చేసిన బాహుబలి సినిమాను ఇప్పటికే ఎంతోమంది లెజండ్‌లు, టాప్‌స్టార్లు అభినందించారు. ఇక మహేష్ అందించిన విషెస్ ఈ ఆనందాన్ని ఇంకా రెట్టింపుజేస్తాయ్.