Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం చొక్కా లేకుండా దర్శనమిచ్చిన సూపర్ స్టార్!

By:  Tupaki Desk   |   18 May 2020 4:00 PM GMT
ఫస్ట్ టైం చొక్కా లేకుండా దర్శనమిచ్చిన సూపర్ స్టార్!
X
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందర్నీ కూడా లాక్ చేసి పడేసింది. సెలబ్రిటీ సామాన్యుడు అనే తేడా లేకుండా అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలంటూ దేశ విదేశాలకు ఇతర ప్రాంతాలకు చక్కర్లు కొట్టే సినీతారలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్యామిలీస్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వేళ తమ ఇంట్లో జరుగుతున్న విశేషాలన్నీ సోషల్ మీడయాలో షేర్ చేస్తున్నారు. తాజగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. 'సరిలేరు మీకెవ్వరు' సినిమా తర్వాత హీరో మహేష్‌బాబు మరో సినిమాకు రెడీ అయ్యారు. పరుశరామ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఓ సినిమా తర్వాత మరో సినిమా షూటింగ్‌కు వెళ్లే మధ్యలో మహేష్ కనీసం రెండు మూడు నెలల గ్యాప్ తీసుకుంటాడు.

కుటుంబంతో సంతోషంగా ఇంట్లోనే గడుపుతున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన షూటింగ్స్ నిలిచిపోవడంతో మహేష్‌ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతున్నాడు. ఇటీవలే సితార తండ్రికి హెడ్‌ మసాజ్‌ చేస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్‌ చేశారు. ఇక తాజాగా మహేష్ బేబీ సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నాడు. తను ఈత కొట్టడమే కాకుండా కూతురుకి కూడా ఈత నేర్పిస్తున్న సీన్ చూడొచ్చు. ఇంకా అసలు విషయం ఏంటంటే.. ఫస్ట్ టైమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చొక్కా లేకుండా.. కనిపించి ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇంతవరకు మహేష్ బాబు ఎప్పుడు కూడా తన ఫిట్ జిమ్ బాడీని ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. పొరపాటున కూడా ఆయన తన చొక్కాను ఏ సినిమాలో తొలగించలేదు. అలా చొక్కా తీయాల్సి వస్తుందంటే సినిమాలు వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మొదటిసారి మహేష్ ఇలా స్విమ్మింగ్ పూల్ దర్శనం.. అభిమానులకు కాస్త సిక్స్ ప్యాక్ చూసిన ఫీలింగ్ కలుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.