Begin typing your search above and press return to search.

మహేష్ లుక్.. ఇలా ఫిక్సయిపోవచ్చా?

By:  Tupaki Desk   |   1 July 2018 11:46 AM GMT
మహేష్ లుక్.. ఇలా ఫిక్సయిపోవచ్చా?
X
టాలీవుడ్ హీరోల్లో లుక్ విషయంలో ఎక్కువ మార్పులు చూపించని కథానాయకుల్లో మహేష్ బాబు ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి ఒక ఆరేడేళ్ల పాటు ఒకే రకమైన లుక్.. హేర్ స్టైల్ తో కనిపించాడతను. ఆ తర్వాత అతడి హేర్ స్టైల్ మారింది. దాంతోనే కంటిన్యూ అయిపోతున్నాడు. మధ్యలో ‘అతిథి’.. ‘పోకిరి’ లాంటి సినిమాల్లో మాత్రమే మహేష్ కొంచెం భిన్నంగా కనిపించాడు. ఆ తర్వాత దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఒకేలా దర్శనమిస్తున్నాడు. ఈ విషయంలో జనాలు కొంచెం మొనాటనీ ఫీలవుతున్న మాట కూడా వాస్తవం. అందుకే వంశీ పైడిపల్లి.. మహేష్ ను మార్చాలనుకున్నాడు. తన సినిమా కోసం మహేష్ ను కొత్త లుక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇందుకోసమే కెరీర్లో ఎన్నడూ లేని విధంగా గడ్డం పెంచాడు మహేష్.

దీనికి సంబంధించిన ఫొటోలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఐతే ఇంకా మహేష్ లుక్ ఫైనల్ కాలేదని అంటున్నారు. సినిమాలో మహేష్ సరిగ్గా ఏ లుక్ లో దర్శనమిస్తాడనే విషయంలో ఇంకా సందిగ్ధత ఉంది. గడ్డం పెంచాక మేకప్ వేస్తే మహేష్ ఎలా ఉంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఏమీ రిలీజ్ చేయకుండానే మహేష్ లుక్ విషయంలో జనాలకు ఒక అంచనా వచ్చేసిందిప్పుడు. ‘సాయి సూర్య డెవలపర్స్’ అన సంస్థ కోసం మహేష్ ప్రచారం చేస్తుండగా.. ఆ సంస్థ ఒక యాడ్ రూపొందించి విడుదల చేసింది. అందులో మహేష్ గడ్డం లుక్ లోనే కనిపిస్తున్నాడు. సూటేసుకుని చాలా రాయల్ గా కనిపిస్తున్నాడు మహేష్ అందులో. మేకప్ అదీ కూడా పర్ఫెక్టుగా సెట్టయింది. లుక్ బాగుందని.. వంశీ సినిమాలోనూ ఇదే ఫైనల్ అని జనాలు ఫిక్సయిపోతున్నారు.