Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌ళ్లీ మైండ్ బ్లాక్ చేసేశాడు!

By:  Tupaki Desk   |   26 Nov 2021 6:12 AM GMT
ఫోటో స్టోరి: మ‌ళ్లీ మైండ్ బ్లాక్ చేసేశాడు!
X
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ క్లాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..

బాబును చూస్తే నిజంగానే మైండ్ బ్లాక్ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అందాల క‌థానాయిక ర‌ష్మిక మంద‌న అంత‌గా బాబు వెన‌క ప‌డ‌డం వెన‌క రీజన్ ఏంటో ఇప్పుడు ఈ ఫోజ్ చూశాక మరోసారి ఖాయంగా చెప్పొచ్చు.

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజా ఫోటోషూట్ లో మహేష్ బాబు స్టైలిష్ గా కనిపించాడు. బ్లాక్ ట్రౌజర్ ముదురు జాకెట్ ధరించి మోటర్ బైక్ పై కూర్చుని మొబైల్ ఫోన్ పట్టుకుని ఫోజిచ్చాడు. అతను ఇటీవల సర్కారు వారి పాట కోసం పొందిన హెయిర్ స్టైల్ ను కొన‌సాగించాడు. ఈ లుక్ లో అత‌డు స్టైలిష్ గానే కాదు.. ఎంతో స్మార్ట్ గా క‌నిపిస్తున్నాడు.

46 ఏజ్ లోనూ ఇంకా 16 ప్ల‌స్ కుర్రాడిలా క‌నిపిస్తున్నాడు. ఇది ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసం లుక్. ఇక‌పోతే స‌ర్కార్ వారి పాట‌లో మ‌హేష్ డ్యూయ‌ల్ షేడ్ ఉన్న పాత్ర‌తో మ‌తులు చెడ‌గొట్ట‌నున్నాడ‌నేది ఓ గుస‌గుస‌. బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక స్కామ్ ల చుట్టూ తిరిగే చిత్ర‌మిది. ఈ చిత్రం చాలా వాస్తవ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోంది. సంక్రాంతి బ‌రిలో వ‌స్తుంద‌ని భావించినా రిలీజ్ తేదీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.