Begin typing your search above and press return to search.

తమిళనాడులో మహేష్ ఫైట్ చేస్తాడట

By:  Tupaki Desk   |   13 Nov 2017 7:12 AM GMT
తమిళనాడులో మహేష్ ఫైట్ చేస్తాడట
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మాహేష్ - భరత్ అనే నేను సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా ఎలా ఉంటుందో గాని సినిమా గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా చాలా వైరల్ అవుతుందనే చెప్పాలి. స్పైడర్ రిజల్ట్ ప్రభావం ఎలా ఉన్నా కూడా అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. దీంతో మహేష్ కూడా సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తనకు సంబదించిన సీన్స్ కాకపోయినా కూడా డైలీ షూటింగ్ స్పాట్ కి వస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా హోలీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. శ్రీమంతుడు సినిమాలోని మామిడి తోట ఫైట్ సీన్స్ ను ఇది గుర్తుచేస్తోందని తెలుస్తోంది. అయితే కొరటాల టీమ్ నెక్స్ట్ షెడ్యూల్ ని తమిళనాడు పొల్లాచ్చికి షిఫ్ట్ చేశారు.

రీసెంట్ గా మహేష్ విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. యాడ్ షూట్ కోసం అమెరికా వెళ్ళాడు. అయితే సూపర్ స్టార్ రాగానే నవంబర్ 26 నుంచి షూటింగ్ మొదలు పెట్టనుంది చిత్ర యూనిట్. కొరటాల శివ సినిమాలో యాక్షన్స్ సీన్స్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. కొరటాల గత సినిమాలకంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హై రేంజ్ లో ఉంటాయని సమాచారం. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.