Begin typing your search above and press return to search.

గ‌ణేశా ఇక నీకు సెల‌వ్‌.. ప్చ్‌!

By:  Tupaki Desk   |   16 Sep 2018 7:33 AM GMT
గ‌ణేశా ఇక నీకు సెల‌వ్‌.. ప్చ్‌!
X
వినాయ‌క చ‌వితిని తెలుగు లోగిళ్ల‌లో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఊరూ వాడా ఇంకా ఆ సంద‌డి తెలుస్తూనే ఉంది. సెల‌బ్రిటీ ఇళ్ల‌లో అయితే ప్ర‌త్యేకించి మందిరాలు నిర్మించి విగ్ర‌హాల్ని ఆవిష్క‌రించి చాలానే హంగామా చేస్తున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో రోజు వినాయ‌క నిమ‌జ్జనానికి ప్లాన్ చేసి విగ్ర‌హాల్ని త‌ర‌లిస్తున్నారు. టాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీల ఇళ్ల‌లో గ‌ణ‌ప‌య్య కొలువుదీరి ఉన్నాడు. మ‌రోవైపు వినాయ‌క‌ నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ సాగుతోంది. ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ ఇంట ఈ ఏడాది ప్ర‌త్యేకించి బొజ్జ గ‌ణ‌ప‌య్య‌కు పూజా పున‌స్కారాలు సాగాయి. ఆ బాధ్య‌త‌ను తీసుకున్న‌ది ఎవ‌రో మీకు తెలుసు.

మ‌హేష్ క్యూట్ కిడ్స్ గౌత‌మ్‌ - సితార ఇద్ద‌రూ ఆ బాధ్య‌త‌ను తీసుకుని స‌వ్యంగా నెర‌వేరుస్తున్నారు. ఇదివ‌ర‌కూ ఆ ఇద్ద‌రూ గ‌ణేషునికి కుడుములు అందించి ప్రార్థ‌న‌లు చేస్తున్న‌ప్ప‌టి ఫోటోల్ని న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో షేర్ చేశారు. క్యూట్ గౌత‌మ్‌ - సితార‌లో ఇంత భ‌క్తి నిండి ఉందా? అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

ఇప్పుడు వినాయ‌క నిమ‌జ్జ‌నానికి టైమ్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా గ‌ణ‌ప‌య్య‌ను ముస్తాబు చేస్తూ కాస్తంత విచారంగానే క‌నిపించారు ఈ క్యూట్ కిడ్స్. అరే.. అప్పుడే నీళ్ల‌లో క‌లిపేయాల్సొస్తోందే! గ‌ణేషా ఏమ‌నుకోవ‌ద్దు ప్లీజ్! అంటూ అమాయ‌కంగా ఎలా చూస్తున్నారో. ``మై క్యూట్ బేబీస్.. గ‌ణేష విస‌ర్జ‌న్‌.. మిక్స్‌ డ్ ఫీలింగ్స్. గ‌ణ‌ప‌య్య‌తో ఇన్నాళ్లు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా పంపించేయ‌డంతోనే విచారంగా క‌నిపిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ త‌ప్ప‌దు మ‌రి`` అంటూ న‌మ్ర‌త సందేశం ఇచ్చారు.