Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: మహేష్ పిల్లల ఈత సరదా

By:  Tupaki Desk   |   4 March 2018 9:36 AM GMT
ఫొటో స్టోరీ: మహేష్ పిల్లల ఈత సరదా
X
స్టార్ హీరోల సినిమాల గురించే కాదు వాళ్ళ పిల్లల ముచ్చట్లు కూడా అభిమానులకు ఆసక్తిగా ఉంటాయి. భవిష్యత్తులో ఎప్పుడో ఒక రోజు వీళ్ళు తారలు కావాల్సిన వాళ్ళే కాబట్టి ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండటం సహజం. ఫ్యామిలీ అంటే ప్రాధాన్యం ఇచ్చే మహేష్ వాళ్ళ విషయంలో ఎంత ప్లానింగ్ తో ఉంటాడో తెలిసిందే. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళకు ఇవ్వాల్సిన టైం వాళ్ళకు ఇస్తూ విదేశీ పర్యటనలు చేసే మహేష్ ప్రతి సినిమాకు ప్రత్యేకంగా తీసుకునే గ్యాప్ ను పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తాడు. ఇందులో మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ కూడా తల్లిగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చడంతో పాటు సోషల్ మీడియాలో ఫాన్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటారు.

మహేష్ పిల్లలు గౌతం - సితార కు సంబంధించిన పిక్స్ - అప్ డేట్స్ అన్ని నమ్రతా తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. పైన పిక్ అందులో భాగంగా పెట్టిందే. ఇద్దరు పిల్లలు స్విమింగ్ పూల్ లో సరదాగా ఆడుకుంటూ ఉంటే క్లిక్ మనిపించిన నమ్రతా దాని పోస్ట్ చేయకుండా ఉండలేకపోయారు. మహేష్ బాల్యంలో నాన్న కృష్ణ కూడా ఇదే తరహాలో తనతో మహేష్ ఉన్నప్పటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో తీయించేవారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి స్టిల్ కెమెరా మెన్ ల సహాయం తప్పనిసరిగా కావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్ని భద్రపరుచుకునే సౌకర్యం కలిగింది.

బాలనటుడిగా వన్ నేనొక్కడినేతో తెరంగేట్రం చేసిన గౌతంని మరికొన్ని సినిమాల్లో చూడాలని ఫాన్స్ ఆశపడుతున్నారు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసాడు. అందులో మంచి హిట్స్ కూడా ఉన్నాయి. గౌతంని ఆ స్థాయిలో కాకపోయినా అప్పుడప్పుడు నటింపజేయాలని అభిమానులు కోరుకుంటున్నా మహేష్ మాత్రం చదువు పూర్తయ్యి ఒక వయసుకు వచ్చాక మాత్రమే ఆ ఆలోచనలో ఉన్నట్టు టాక్.