Begin typing your search above and press return to search.

మహేశ్ 19న జాయినవుతాడు

By:  Tupaki Desk   |   14 Jun 2017 4:33 AM GMT
మహేశ్ 19న జాయినవుతాడు
X
మహేశ్ బాబు సినిమా కోసం ఇప్పుడు మన తెలుగులోనే కాదు పక్క రాష్ట్రం సినిమా ప్రేక్షకులు కూడా ఆశక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఏ ఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న స్పైడర్ సినిమా తమిళ్ ​లో ​కూడా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంబంధించిన రైట్స్ ఇప్పటికే మంచి బిజినెస్ చేసింది. సినిమా కూడా​ దాదాపుగా ​పూర్తికావస్తుంది.

ఇక మహేశ్ బాబు స్పైడర్ సినిమా విడుదల అటు ఉంచితే, దీన్ని తరవాత వస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ ఈ నెల జూన్ 19న మొదలుకాబోతుంది. మహేశ్ ఇంకా స్పైడర్ షూటింగ్ నుండి పూర్తిగా బయటపడలేదు. కానీ డైరెక్టర్ కొరటాల శివ తన ప్లాన్ పక్కాగా అమలుపరిచే పనిలో ఉన్నాడు. మహేశ్ లేకుండానే షూటింగ్ మోదలుపెడుతున్నాడు. ఈ సినిమా కోసం అసెంబ్లీ కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మహేశ్ లేనివి ముందుగా షూట్ చేద్దాం అనుకుంటున్నారు కొరటాల శివ. షూటింగ్లో ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే జరుగుతుంది అని తెలుస్తుంది. అయితే 17న అనుకున్నట్లు స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తయితే.. 19న మహేష్‌ కూడా జాయినవుతాడు.

‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్ రాజకీయ నాయకుడుగా ముఖ్యమంత్రి గా కనపడనున్నాడు. ముందటికంటే ఫిట్ గా రఫ్ గా కనిపించి అందరినీ ఆకట్టుకొంటాడు అని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా కియారా అద్వానీ నటించబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/