Begin typing your search above and press return to search.
నా జీవితాంతం ఈయనే సౌండ్ రికార్డిస్ట్
By: Tupaki Desk | 19 Sep 2019 8:49 AM GMTసూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం `సరిలేరు నీకెవ్వరు` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ 26వ చిత్రమిది. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎఫ్ 2 ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనీల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కశ్మీర్ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ ని తెరకెక్కించారు. మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ని అందిస్తున్నామని అనీల్ రావిపూడి చెబుతున్నారు. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం.. ఈ చిత్రంతోనే చాలా గ్యాప్ తర్వాత లేడీ బాస్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా మహేష్ ఆన్ లొకేషన్ ఫోటో ఒకటి షేర్ చేసి నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. త్రోబ్యాక్ గురువారం అంటూ ఆయన శైలిలో స్పందించారు. ``ఇదిగో ఈయనే నా సౌండ్ రికార్డిస్ట్ నగారా రాము. ఆయన్ని మేము ఇలానే పిలుస్తాం. నా మొట్ట మొదటి సినిమా నుంచి నా సినిమాలకు పని చేస్తున్నారు. ఆయన్ని నాతో తప్ప వేరొక సెట్ లో నేనెప్పుడూ చూడలేదు. అన్నివేళలా నాపై ప్రేమ గౌరవం ఉన్నవాడు... నాతో ఉన్నాడు. అన్న తమ్ముడు తరహా మేం. దూకడు-మహర్షి-సరిలేరు నీకెవ్వరు అన్నిటికీ ఆయన ఉన్నారు`` అంటూ వివరాల్ని వెల్లడించారు.
మహేష్ ఎమోషన్ లెవల్ ని గ్రాఫ్ వేసి పరిశీలిస్తే ఈ ఫోటోతో ఆయన వేరొకటి చెప్పదలిచారని అర్థమవుతోంది. అన్ని వేళలా తానంటే ప్రేమను అభిమానాన్ని చూపించేవారికి.. గౌరవాన్ని ఇచ్చేవారికి తనవద్ద కొలువు ఎప్పటికీ ఉంటుంది. నాతో పనిలేదు అని వేరొకరి దగ్గరకు వెళ్లిపోతే వాళ్లకు ఇక ఎగ్జిట్ బోర్డ్ తగిలించినట్టేనన్న అర్థం స్ఫురిస్తోంది జాగ్రత్తగా పరిశీలిస్తే..!! ఆ రకంగా ఆయన ఎవరికో వేశారు కదూ కౌంటర్...