Begin typing your search above and press return to search.

మహేష్‌ బాబు స్కూల్ పెడుతున్నాడా?

By:  Tupaki Desk   |   27 July 2017 4:54 PM IST
మహేష్‌ బాబు స్కూల్ పెడుతున్నాడా?
X
తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొత్త కథలుతో కొత్త సినిమాలుతో పాటుగా కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెడుతున్నాడట. కొన్ని పనులు మన సంతోషం కోసం చేస్తాం కొన్ని లాభాలు కోసం చేస్తాం. ఇప్పుడు మహేశ్ దేని కోసం వ్యాపారం పెట్టబోతున్నాడో పూర్తిగా తెలియకపోయినా వ్యాపారం అయితే కచ్చితంగా చేస్తాడు అని తెలుగు మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి.

మహేశ్ బాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ఒక వరల్డ్ క్లాస్ స్కూల్ ఒకటి స్థాపించబోతున్నాడట. ఈ స్కూల్ ని తన ఫ్యామిలి ఫ్రెండ్ ఇదివరకు తన సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేసిన ఒక వ్యక్తితో కలిసి ఓపెన్ చేస్తాడట. అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ గా నిర్మాణం జరుగుతుంది అని అందరూ చెబుతున్నారు.. గవర్నమెంట్ కూడా అలానే ప్రచారం చేస్తుంది. అక్కడ కొత్త వ్యాపారాలుకు కొన్ని సబ్సిడీలు టాక్స్ మినహాయింపులు కూడా ఉంటాయి. పైగా ఆంద్రప్రదేశ్ రాజధాని దగ్గర ఏ ఇంటర్నేషనల్ స్కూల్ లేదు అనే చెప్పాలి. అసలు మహేశ్ బాబు ముందు హైదరాబాద్ లోనే పెడదాం అనుకున్నారు అంటా కానీ ఇప్పటికే హైదరాబాద్ లో లెక్కకు చిక్కనన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండడటంతో ఫోకస్ అమరావతి పైకి మారిందట.

వ్యాపారం గురించి అటుంచి సినిమాల విషయానికి వస్తే మహేశ్ కొత్త సినిమా స్పైడర్ సినిమా షూటింగ్ ఒక్క సాంగ్ మినహాయిస్తే మిగతా షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. స్పైడర్ సినిమా టీజర్ కూడా వచ్చేస్తోంది. మరో ప్రక్క కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇంత బిజీగా ఉన్న మహేష్‌ స్కూల్ పనులు ఎప్పుడు చక్కపెడతాడో చూడాలి.