Begin typing your search above and press return to search.

మహేష్ చాలా ఓపెన్ అవుతున్నాడే

By:  Tupaki Desk   |   5 May 2019 11:00 PM IST
మహేష్ చాలా ఓపెన్ అవుతున్నాడే
X
ఇంతకు ముందు ఎన్నడూ లేని తరహాలో మహేష్ బాబు నిన్న మీడియాతో అరగంటకు పైగా చాలా ఓపెన్ గా ఇంటరాక్ట్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి ప్రెస్ మీట్లు చేయడం కొత్త కాకపోయినా మహేష్ శైలిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇబ్బంది పెట్టె ప్రశ్నలకు సైతం తడుముకోకుండా కూల్ గా సెటిల్డ్ గా సమాధానాలు చెప్పిన తీరు నిజం చెప్పాలంటే ఆకట్టుకుంది.

ప్రీ రిలీజ్ లో పూరి పేరు ప్రస్తావించకపోవడం సుకుమార్ ప్రాజెక్ట్ గురించి గుచ్చి గుచ్చి అడిగినప్పుడు తడబడకుండా స్పష్టంగా సమాధానం ఇవ్వడం అంతా బాలన్స్ గా అనిపించింది. నిజానికి మహర్షి టాపిక్ నుంచి కొందరు మీడియా ప్రతినిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినా మహేష్ మాత్రం వాటికి బదులిచ్చాకే సినిమా గురించి చర్చించడం విశేషం

ఇక్కడ సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా బాగానే కనిపిస్తోంది. మహేష్ టీం అందులో జరుగుతున్న ట్రెండ్స్ పట్ల ఎంత అలెర్ట్ గా ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది. శ్రీమంతుడు పోలికలు మహర్షిలో ఎక్కువగా ఉన్నాయనే కామెంట్స్ తన దృష్టికి వచ్చాయని ఒప్పుకున్న మహేష్ నెట్ లో జరుగుతున్న వాటి పట్ల తనకు అవగాహన ఉందని చెప్పకనే చెప్పినట్టే.

దానికి తోడు ప్రీ రిలీజ్ లో వంశీ పైడిపల్లిని పొగిడితే దాన్ని సుకుమార్ కి కౌంటర్ వేసినట్టు కొందరు అన్వయించిన తీరుని ప్రస్తావించిన మహేష్ సారీ చెప్పాడు తప్ప మీడియాతో సహా ఎవరిని తప్పుబట్టకపోవడం గమనార్హం. మొత్తానికి ఇంతకు ముందు కన్నా ఎక్కువ క్లారిటీ మహేష్ తీరులో కనిపించడం విశేషం. ఇది మహర్షి పాత తెచ్చిన మార్పా అనేది గురువారం తేలిపోతుంది