Begin typing your search above and press return to search.
మహేష్ నిజంగానే ఈగోకు వెళ్ళాడా ?
By: Tupaki Desk | 4 May 2019 6:24 AM GMTమహర్షి విడుదల ఇంకో ఐదు రోజుల్లో కానుంది. అభిమానుల ఎదురు చూపులు ఇప్పటికే ఓ రేంజ్ ని దాటిపోయాయి. భరత్ అనే నేను తర్వాత ఏడాది గ్యాప్ కావడంతో దాన్ని మించిన బ్లాక్ బస్టర్ దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇది సహజమే కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు కాని టీజర్ తో మొదలుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా ట్రైలర్ తో సహా ఇప్పటిదాకా మహర్షి కు సంబంధించినది ఏదీ సూపర్ ఎగ్జైటింగ్ గా అనిపించలేదు.
దీంతో కంటెంట్ మాట్లడుతుందన్న ధీమా నిర్మాత దిల్ రాజు తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లిలో బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా సుకుమార్ విషయం గురించి మహేష్ ఇంకా మనసులో పెట్టుకునే ఉన్నాడా అంటే మొన్న స్పీచ్ లో ఎన్ని సంవత్సరాలైనా వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు వెయిట్ చేస్తారని అదే కొందరు రెండు నెలలకే ఓపిక నశించి వెళ్లిపోతారని కౌంటర్ ఇచ్చాడు
ఇది నేరుగా సుకుమార్ ని ఉద్దేశించి అన్నదా లేక క్యాజువల్ గా అన్న మాటనా అనే సంగతి పక్కన పెడితే ఇది తగిలింది మాత్రం సుక్కుకే అని ఫ్యాన్స్ ఫీలింగ్. నిజానికి సుక్కు మహేష్ ల ప్రాజెక్ట్ కార్యాచరణలోకి రాకపొవడానికి కారణం కథ మీద ఏకాభిప్రాయం మిస్ కావడం వల్లే. అది ఎంతకీ జరగ్గపోవడంతో ఫైనల్ గా సుక్కు అల్లు అర్జున్ బాట పట్టాడు .
కాని ఈలోపు అనుకున్న దాని కన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోయింది. మహేష్ సాధారణంగా పంచులకు పబ్లిక్ స్టేజి మీద కౌంటర్లకు దూరంగా ఉంటాడు. ఆ ఇష్యూ ఎంత వెంటాడకపోతే దాని ప్రస్తావన ఇలా ఇన్ డైరెక్ట్ గా తెస్తాడు అనేది మరో కోణంలో వస్తున్న విశ్లేషణ. ఏదైతేనెం మహేష్ దాదాపుగా సుకుమార్ తో ఇక ఎప్పటికి చేయడేమో అనేది ఇదంతా దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళ వెర్షన్. నిజాలు ఆ ఇద్దరికే ఎరుక