Begin typing your search above and press return to search.

`ఎఫ్‌-2` సీక్వెల్లో మ‌హేష్ ఉన్న‌ట్టా లేన‌ట్టా?

By:  Tupaki Desk   |   10 March 2020 6:15 AM GMT
`ఎఫ్‌-2` సీక్వెల్లో మ‌హేష్ ఉన్న‌ట్టా లేన‌ట్టా?
X
ప్ర‌స్తుతం యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి `ఎఫ్‌-2` కి సీక్వెల్ గా `ఎఫ్‌-3` స్క్రిప్టును సిద్ధం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈసారి వెంకటేష్- వ‌రుణ్ తేజ్ ల‌తో పాటు మ‌రో టాప్ స్టార్ ని యాడ్ చేసి ముగ్గురు స్టార్ హీరోల‌తో కామెడీ చేయించేందుకు ద‌ర్శ‌కుడు రెడీ అవుతున్నట్లు కొద్ది రోజులుగా ప్ర‌చారం సాగుతోంది. మూడో హీరోగా మాస్ రాజా ర‌వితేజ‌.. ప్రిన్స్ మ‌హేష్ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ఫైన‌ల్ గా మ‌హేష్ నే బ‌రిలోకి దించ‌నున్నార‌ని క‌న్ఫామ్ చేసేస్తూ ప్ర‌చార‌మైంది.

`స‌రిలేరు నీకెవ్వ‌రు`లో రావిపూడి కామెడీ టైమింగ్ తో మ‌హేష్ క‌నెక్ట‌వ్వ‌డంతోనే ఈ సీక్వెల్ కి మ‌హేష్ అంగీక‌రించార‌ని.. అత‌డికి త‌గ్గ‌ట్టు స్క్రిప్టును మార్చార‌ని ప్ర‌చారం సాగింది. ముగ్గురు హీరోలతో తెర‌నిండుగా కామెడీ ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని ప్ర‌చారమైంది. అయితే ఈ సినిమాలో మ‌హేష్ ఉన్న‌ట్టా లేన‌ట్టా? అన్న‌దానికి ఇప్ప‌టివ‌ర‌కూ అధికారిక స‌మాచారం ఏదీ లేదు. తాజాగా అనీల్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అస‌లు సంగ‌తి రివీలైంది. అస‌లు ఈ స్క్రిప్ట్ లో మూడ‌వ పాత్ర‌కి ఛాన్సే లేద‌ని రైట‌ర్ టీమ్ నుంచి తెలిసింది. అదీ మ‌హేష్ రేంజ్ స్టార్ ఈ స్క్రిప్ట్ కు అవ‌స‌రం లేద‌ని లీకులందాయి.

ప్ర‌స్తుతం అనీల్ అండ్ రైట‌ర్స్ టీమ్ స్క్రిప్ట్ ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ రెడీ అయిపోయింద‌ని ఓ ప్ర‌చారం సాగింది. అయితే అవ‌న్నీ గాలి వార్త‌లే.. స్క్రిప్ట్ వండే ప‌నుల్లోనే ఇటీవ‌ల‌ టీమ్ బిజీ అయ్యింద‌ట‌. తొలి భాగం ప్లేవ‌ర్ మిస్ అవ్వ‌కుండా ఈసారి కామెడీని కొత్త పంథాలో చూపించేలా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇక స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో కామెడీ విష‌య‌మై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. కొంద‌రు క్రిటిక్స్ మూస కామెడీ అంటూ విమ‌ర్శించ‌డంతో ఈసారి ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా రైట‌ర్స్ టీమ్ జాగ్ర‌త్త ప‌డుతోంద‌ట‌. ఇక ఈ కామెడీ స్క్రిప్టులో మ‌హేష్ న‌టించేంత స్కోప్ క‌నిపించ‌లేద‌ని కూడా తెలుస్తోంది. ఒక‌వేళ ప్ర‌త్నామ్యాయంగా మ‌రో కామెడీ స్టార్ యాడ్ అవుతారా? అంటే దానికి ఇంకా స‌మాధానం రావాల్సి ఉంది. ఇప్ప‌టికైతే మూడ‌వ హీరో కి నో ఛాన్స్ అనే చెబుతున్నారు. మ‌రీ అంత‌గా అవ‌స‌రం అనుకుంటే మాస్ రాజా ఎలాగూ సిద్దంగా ఉంటాడు కాబ‌ట్టి అనీల్ గాబ‌రా ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ట‌. ప్ర‌స్తుతం వెంకీ .. వ‌రుణ్ వేర్వేరు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అవి పూర్తి చేసుకుని అనీల్ రావిపూడి తో జాయిన్ అవుతార‌ట‌.