Begin typing your search above and press return to search.
#SSMB28 : టీ కప్పులో తుఫాన్ చల్లారినట్లే
By: Tupaki Desk | 13 Nov 2022 5:09 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యి రెండవ షెడ్యూల్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా అనూహ్యంగా సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. సినిమా యొక్క స్క్రిప్ట్ తో పాటు పలు విషయాల్లో మార్పులు చేర్పులు అంటూ కూడా ప్రచారం జరిగింది.
#SSMB28 సినిమా గురించి జరిగిన ప్రచారం లో కొన్ని నిజాలు ఉండగా కొన్ని అబద్ధాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు పాత్ర విషయంలో చిన్న చిన్న మార్పులు అయితే జరిగినట్లుగా త్రివిక్రమ్ కాంపౌండ్ నుండి అనధికారికంగా సమాచారం అందుతోంది. అంతే కాకుండా ఈ సినిమా లోని అత్యంత కీలకమైన ఒక పాత్రకు మలయాళ స్టార్ నటుడిని తీసుకోవడం జరిగిందట.
ఆ పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని.. అయితే తాజాగా స్క్రిప్ట్ మార్చిన తర్వాత ఆ పాత్ర యొక్క పరిధి చాలా తక్కువ అయ్యిందనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా యొక్క వివాదాలు.. సీరియస్ చర్చలు అన్నీ కూడా ముగిసినట్లే అని... అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల చివర్లోనే మళ్లీ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాస్త రాజీ పడి మహేష్ బాబు సినిమా ను చేస్తున్నాడు అనే పుకార్లు ఉన్నాయి. అయితే ఆ పుకార్లు నిజం కాదని.. మహేష్ బాబు ను అన్ని విషయాలకు ఒప్పించిన తర్వాత మాత్రమే త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అయ్యింది.. మళ్లీ సినిమా పునః ప్రారంభంకు కూడా మహేష్ పూర్తి సంతృప్తితో ఉన్నాడని.. త్రివిక్రమ్ కూడా చాలా నమ్మకంతో సినిమాను చేస్తున్నాడని అంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. సెకండ్ హీరోయిన్ పాత్ర ఉందా లేదా అనే విషయమై ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య అను ఎమాన్యూల్ ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా సంప్రదించారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ బాబు తో పాటు త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.