Begin typing your search above and press return to search.

స‌ర్కారు వారి ఛార్మింగ్ లుక్ సూప‌ర్బ్!

By:  Tupaki Desk   |   26 April 2022 1:04 PM GMT
స‌ర్కారు వారి ఛార్మింగ్ లుక్ సూప‌ర్బ్!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `స‌ర్కారు వారి పాట` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మే 12న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దీంతో యూనిట్ ప్ర‌చారం ప‌నులు షురూ చేయ‌డానికి రెడీ అవుతోంది. 29న‌ `ఆచార్య` రిలీజ్ సంద‌ర్బంగా ఆ ముందురోజైన 28వ తేదీన ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డానికి స‌మాయ‌త్తం అవుతున్నారు.

`ఆచార్య` సినిమా కి ట్రైల‌ర్ ఎటాచ్ చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది. అదే నిజ‌మైతే `ఆచార్య` థియేట‌ర్ల‌లో స‌ర్కారి వారి మోత‌ మ్రోగ‌నుంది. తాజాగా దానికి సంబంధించిన సంకేతాలు కొత్త పోస్ట‌ర్ తో అందించిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌హేష్ కొత్ పోస్ట‌ర్ ఒక‌టి యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో మ‌హేష్ ఛార్మింగ్ లుక్ లో ఆక‌ట్టుకుంటున్నాడు.

వైట్ క‌ల‌ర్ ప్యాంట్ పై లైట్ రోజ్ క‌ల‌ర్ పుల్ హ్యాండ్స్ టీష‌ర్ట్ మ్యాచింగ్ లో మనోహారంగా క‌నిపిస్తున్నాడు. ఒక చేతిలో వ్యాలెట్..మ‌రో చేతిలో క‌రెన్సీ నోటు..ఫేస్ లో స్మైల్ తో ఆద్యంతం స్మార్ట్ లుక్ లో అల‌రిస్తున్నాడు. ఫోటో ఔట్ డోర్ షూటింగ్ కి సంబంధించిన‌ది గా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో విదేశీ అందాలు క‌నువిందు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. మ‌హేష్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది.

సూప‌ర్ స్టార్ ఛార్మ్ లుక్ పై ఫ్యాన్స్ కామెంట్స్ ఆస‌క్తిక‌రం. ఇక ఆన్ స్ర్కీన్ పై స‌ర్కారు వారు ఇంకెంత అందంగా క‌నిపిస్తారో. ఈ చిత్రానికి ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మ‌హేష్‌కి జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన `క‌ళావ‌తి` సాంగ్ పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి ముందే మ‌రిన్ని సింగిల్స్ అల‌రించ‌డం ఖాయమ‌ని టీమ్ ధీమాగా ఉంది.