Begin typing your search above and press return to search.

మ‌హేష్ పొగ‌రు అణిచేసిన ఆమె ట‌చ్

By:  Tupaki Desk   |   18 Feb 2022 8:00 AM IST
మ‌హేష్ పొగ‌రు అణిచేసిన ఆమె ట‌చ్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ `స‌ర్కారు వారి పాట‌` స‌మ్మ‌ర్ కానుక‌గా మే 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో చిత్ర‌యూనిట్ ప్ర‌చారం  ప్రారంభించింది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌తో హీటెక్కించిన మ‌హేష్ అండ్ కో సినిమాకి మ‌రింత హైప్ తీసుకొచ్చే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

అటు మ్యూజిక‌ల్ గానూ సినిమాను హైలైట్ చేస్తున్నారు. ఇటీవ‌లే `క‌ళావ‌తి` అంటూ సాగే తొలి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.  ఈ పాట శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇందులో కళావ‌తి పాత్ర (కీర్తి సురేష్) హ‌ఠాత్తుగా మ‌హేష్ ని కౌగిలించుకునే సీన్ హైలైట్.

సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు ట్యూన్ ప‌ర్పెక్ట్ గా కుదిరింది. అనంత‌  శ్రీరామ్ సాహిత్యం హైలైట్ అయింది. ఇక ఈ పాట‌లో మ‌హేష్  పొగ‌ర‌బోతు కుర్రాడిగా క‌నిపిస్తున్నారు. పాత్ర ర‌గ్గ‌డ్ యాటిట్యూడ్ తో మాసీగా  క‌నిపిస్తోంది. అలాంటి కుర్రాడు ఒక్క‌సారిగా స్త్రీ స్ప‌ర్శ‌కు గురైతే ఏం జ‌రిగింది? అన్న‌దే  ఈ పాట సారాంశం.

ఆ స్ప‌ర్ఫ మ‌హేష్ యాటిట్యూడ్ తో పాటు ఆలోచ‌నలో  మార్పుని తీసుకొస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.  దీన్ని బ‌ట్టి మ‌హేష్ పాత్ర‌పై ఓ అంచానికి రావొచ్చు. మ‌హేష్ ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు. సున్నిత‌మైన పాత్ర‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపించారు. దీంతో `ఎస్ వీపీ`లో మ‌హేష్ పాత్ర సంవిధానం కొత్త‌గా ఉంటుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

అలాగే మ‌హేష్  ని ప‌ర‌శురామ్ త‌న‌దైన శైలిలో కంప‌ర్ట్  జోన్ నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చాడ‌ని ప్రూవ్ అవుతోంది. సినిమాలో క‌మ‌ర్శియ‌ల్ అంశాలు పుష్క‌లంగా జొప్పించిన‌ట్లు క‌ళావ‌తి పాట‌..మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్ బ‌ట్టి అభిమానులు గెస్ చేస్తున్నారు. దీంతో మ‌హేష్ పాత్ర‌ని `గీత గోవిందం`లో విజ‌య్ దేవ‌ర‌కొండ విజ‌య్ అనే పాత్ర‌కు పూర్తి కాంట్రాస్ట్ గా భావించ‌వ‌చ్చు.

`గీత‌గోవిందం`లో అంద‌మైన మంచి అమ్మాయిన పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డాల‌న్నిది విజ‌య్ పాత్ర స్వ‌భావం. కానీ స‌ర్కారు వారి పాట‌లో మ‌హేష్ రోల్ అందుకు భిన్నంగా క‌నిపిస్తోంది.. విజ‌య్ పాత్ర స్ఫూర్తితోనే  మ‌హేష్ పాత్ర‌ని కూడా డిజైన్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని అభిమానులు  గెస్ చేస్తున్నారు. దీనిపై పుల్ క్లారిటీ రావాలంటే ట్రైల‌ర్ రిలీజ్  వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

ప్ర‌స్తుతం `స‌ర్కారి వారి పాట` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ల్లో ఉంది. మ‌హేష్  డ‌బ్బింగ్ ప‌నులు పూర్తిచేసి కొత్త సినిమా షూట్ లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ మ‌రో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి షెడ్యూల్ ని  దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మ‌హేష్ కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.