Begin typing your search above and press return to search.
మహేష్ లో మళ్లీ పోకిరిని చూస్తామట!
By: Tupaki Desk | 16 Feb 2022 5:17 PM ISTమహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది.
హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర ఏంటీ.. అసలు మహేష్ బాబు పాత్రకు బ్యాంకింగ్ రంగానికి ఉన్న లింక్ ఏంటీ అనే విషయాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఇప్పటి వరకు మహేష్ బాబు పాత్ర ఏంటీ.. ఆయన పాత్ర పేరు ఏంటీ అనే విషయాలను కూడా మేకర్స్ రివీల్ చేయలేదు. కాని తాజాగా విడుదల అయిన కళావతి పాట కు లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలో మహేష్ బాబు పాత్ర చాలా కేర్ లెస్ గా.. ఏమాత్రం సమాజం గురించి పట్టనట్లుగా ఉంటుందట. అమ్మాయిలు ప్రేమ గురించి పట్టించుకోని వ్యక్తిగా కనిపిస్తాడట.
అలాంటి ఒక వ్యక్తికి హీరోయిన్ కళావతి కనిపించిన వెంటనే గుండెల్లో కొత్త ఆలోచనలు మొదలు అవ్వడం.. ఆమె హగ్ ఇవ్వడంతో మతి పోయి ప్రేమలో పడటం జరుగుతుందట.
మొదటి సారి హీరోయిన్ కళావతి హీరోకు హగ్ ఇచ్చిన సమయంలోనే ఆ పాట ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. అనంత శ్రీరామ్ చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమాలో హీరో పాత్ర పోకిరి సినిమాలో హీరో పాత్ర తరహాలో ఉందనే టాక్ వినిపిస్తుంది.
దర్శకుడు పరశురామ్ తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు సినిమా గురించి మాట్లాడిన సమయంలో మహేష్ బాబు పాత్ర పోకిరిలో పండుగాడు తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు.
సినిమాలో మొత్తం అయిదు పాటలకు గాను నాలుగు పాటలు అనంత శ్రీరామ్ రాసినట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమాలోని హీరో పాత్ర విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిని మరింతగా పెంచినట్లు అయ్యింది.
గీత గోవిందం సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సర్కారు వారి పాట సినిమా ను సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
కీర్తి సురేష్ మరియు మహేష్ బాబు ల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.