Begin typing your search above and press return to search.

మ‌హేష్‌ కి కుమారి న‌చ్చేసిందిట‌

By:  Tupaki Desk   |   3 Oct 2015 3:30 PM GMT
మ‌హేష్‌ కి కుమారి న‌చ్చేసిందిట‌
X
సుకుమార్ రైటింగ్స్ ప‌తాకంపై సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ ప్ర‌చారం ఊపందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 20 నుంచి ఎన్టీఆర్‌ తో సెట్స్‌ కెళ్లే లోపే కావాల్సినంత ప్ర‌చారం కొట్టేయాల‌ని సుక్కూ స్పీడ్ పెంచాడు. కుమారి 21 ఎఫ్ ట్రైల‌ర్‌ ని నిన్న రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ యూత్‌ కి బాగా క‌నెక్ట‌యిపోయింది. కేవలం యూత్‌ కి మాత్ర‌మే కాదు.. సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌ కి కూడా పిచ్చి పిచ్చిగా న‌చ్చేసిందిట‌. ఈ ట్రైల‌ర్ చూసి సుకుమార్‌ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ప్రిన్స్‌.

వాస్త‌వానికి 1నేనొక్క‌డినే వంటి ఫ్లాప్ సినిమాని ఇచ్చినందుకు సుకుమార్ పై మ‌హేష్ కోపం ప్ర‌ద‌ర్శిస్తాడేమో అని అనుకున్నా.. అస‌లు ప్రిన్స్‌ లో కించిత్ భంగ‌పాటు కూడా క‌నిపించ‌లేదు. ప‌రాజ‌యానికి అంద‌రం బాధ్యుల‌మే. ఒక్క సుకుమార్ మాత్ర‌మే కాదు.. అని ప‌లుమార్లు చెప్పిన మ‌హేష్ ఇప్పుడు సుక్కూ సినిమా ట్రైల‌ర్ బావుందంటూ త‌న‌లోని స్పిరిట్‌ ని, మంచి త‌నాన్ని మ‌రోసారి ఆవిష్క‌రించాడు. కుమారి 21ఎఫ్ ఇంప్రెస్సివ్‌. ర‌త్న‌వేలు స‌ర్ ప‌నిత‌నం, దేవీశ్రీ మ్యూజిక్ అస్సెట్. సుకుమార్‌ కి ఆల్ ది బెస్ట్‌.. అంటూ ట్వీటాడు మ‌హేష్‌.

గతంలో సూర‌జ్ పాంచోళీ, ఆథియా జంట‌గా న‌టించిన హీరో చిత్రానికి ఈ త‌ర‌హాలో ఆల్ ది బెస్ట్ చెప్పిన మ‌హేష్ మ‌ళ్లీ ఇప్పుడు అదే తీరుగా స్పందించారు. అప్పుడు స‌ల్మాన్‌ ఖాన్ (హీరో నిర్మాత‌)కి, ఇప్పుడు సుకుమార్‌ కి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ప్రిన్స్ పైవిధంగా ట్వీటార‌న్న‌మాట‌.