Begin typing your search above and press return to search.

50 డేస్ జోష్... బిగ్ హ‌గ్ ఇచ్చిన ఎంబీ!

By:  Tupaki Desk   |   29 Feb 2020 10:00 AM GMT
50 డేస్ జోష్... బిగ్ హ‌గ్ ఇచ్చిన ఎంబీ!
X
టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబుకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా మ‌రోసారి ప్రూవ్ చేసింది. సంక్రాంతి బ‌రిలో `అల వైకుంఠ‌పురంలో`తో పోటీ ప‌డిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్...అంటూ హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర న‌టించడంతో ఈ సినిమాకు మ‌రింత హైప్ వ‌చ్చింది. ఈ రోజుతో `స‌రిలేరు నీకెవ్వ‌రు` స‌క్సెస్‌ఫుల్గా 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. దీంతో, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా తో త‌న‌కు మంచి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంక‌ర‌ల‌కు ప్రిన్స్ బిగ్ హ‌గ్ ఇచ్చాడు.

అనిల్ రావిపూడి, మ‌హేష్ బాబుల కాంబోలో వ‌చ్చిన‌ ‘సరిలేరు నీకెవ్వరు‘ చిత్రం విడుదలై నేటికి 50 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రిన్స్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకరలకు మ‌హేష్ బిగ్ హ‌గ్ ఇస్తూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఎంటైర్ యూనిట్‌కు ప్రిన్స్ ‘థ్యాంక్స్’ చెప్పాడు. దీంతోపాటు, విజయశాంతి, రష్మిక, రత్నవేలు, ప్రకాశ్ రాజ్, దేవీశ్రీ ప్రసాద్ లను మహేశ్ ట్యాగ్ చేశాడు.