Begin typing your search above and press return to search.

మహేష్‌ కూడా చేంజ్ అనేశాడా??

By:  Tupaki Desk   |   1 March 2017 11:38 PM IST
మహేష్‌ కూడా చేంజ్ అనేశాడా??
X
సూపర్ స్టార్ మహేష్‌ ఇప్పుడు ఏ.ఆర్.మురుగదాస్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత మనోడు కొరటాల శివ డైరక్షన్లో సినిమా చేయడానికి మే నెల నుండి సన్నద్దమైపోతాడు. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా కాస్త గాట్టిగానే ఫోకస్ చేశాడు.

మొన్న నేను లోకల్ సినిమా రిలీజైనప్పటిన నుండి.. అసలు హీరోయిన్ కీర్తి సురేష్‌ గురించి చాలా డిస్కషన్లే జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మడు చాలా లావెక్కిపోవడంతో.. అసలు స్టార్ హీరోల ప్రక్కన ఈమె హీరోయిన్ గా సెట్టవుతుందా అనే సందేహం మనోళ్లకు వచ్చేసింది. అందుకే దర్శకుడు త్రివిక్రమ్ ఆమెను సన్నబడిమని చెబితే.. ఇప్పుడు కొరటాల అసలు ఈమెను తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడట. ఒకవేళ కీర్తి కాకపోతే మహేష్‌ కోసం రెడీగా ఏ హీరోయిన్ ఉంది అనే విషయం కూడా కాస్త ఆలోచించాల్సిందే.

ఆల్రెడీ సమంత.. కాజల్.. శృతి హాసన్.. వంటి హీరోయిన్లతో మహేష్‌ పనిచేశాడు కాబట్టి.. ఈసారి ఎవరైనా ఫ్రెష్‌ ఫేస్ అయితే బాగుంటుందని కొరటాల అభిప్రాయపడ్డాడట. దానితో 1 నేనొక్కడినే సినిమాకు కృతి సేనన్ ను దించినట్లు ఇప్పుడు కూడా ఒక కొత్త అమ్మాయిని దించేద్దాం అని మహేష్‌ కూడా ఫిక్సయ్యాడట. చూద్దాం మరి ఏమవుతుందో!!