Begin typing your search above and press return to search.

బాబు సినీ వీడియోల్లో.. యాడ్స్ కూడా అవే

By:  Tupaki Desk   |   9 April 2018 4:07 AM GMT
బాబు సినీ వీడియోల్లో.. యాడ్స్ కూడా అవే
X
మహేష్ బాబు కొత్త సినిమా హంగామా అఫీషియల్ గా బిగిన్ అయిపోయింది. భరత్ అనే నేను విడుదలకు మరో రెండు వారాల గ్యాప్ కూడా లేదు. ఆడియో ఫంక్షన్ తర్వాత ప్రమోషన్స్ లో మరింతగా వేగం పెంచిన యూనిట్.. ఇప్పుడు సినిమాకు మేకింగ్ వీడియోలను కూడా ఇస్తున్నాయి.

యూట్యూబ్ లో ఏవైనా వీడియోలను చూసే సమయంలో ముందు వెనక.. కొన్ని సార్లు మధ్యలో కూడా యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఆ సంగతి తెలిసిన విషయమే అయినా.. ఈ యాడ్స్ ర్యాండమ్ గా వస్తుంటాయి. కానీ మహేష్ సినిమాలకు సంబంధించిన వీడియోలు.. ముఖ్యంగా భరత్ అనే వీడియోస్ చూస్తున్న సమయంలో మాత్రం.. ఎక్కువగా మహేష్ చేసిన యాడ్స్ మాత్రమే కనిపిస్తుండడం ఆశ్యర్యం కలిగించే విషయమే. అటు సినిమా స్టార్ గా మాత్రమే కాదు.. ఇటు యాడ్ అండర్స్ మెంట్స్ లో కూడా మహేష్ బాబు చాలా పెద్ద స్టార్.

మహేష్ చేతిలో ఉన్నన్ని యాడ్స్ మరే సౌత్ హీరో దగ్గరా ఉండవు అనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు భరత్ అనే నేను ఒక్కో వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేయడంలో ఆశ్చర్యం లేదు. వీటితో పాటు మహేష్ యాడ్స్ ఎక్కువగా ప్లే అవుతుండడంతో.. ఫ్యాన్స్ కు డబుల్ డోస్ మాదిరిగా ఉంది. అటు కంపెనీలు కూడా ఇదే విషయంపై చాలా ప్లానింగ్ గా తమ యాడ్స్ ను సెట్ చేయించుకుని వ్యూస్ సంపాదించుకుంటున్నాయి.