Begin typing your search above and press return to search.

అమ్మ కాఫీతో మహేష్‌ టెన్షన్ క్లియర్

By:  Tupaki Desk   |   24 April 2018 4:46 AM GMT
అమ్మ కాఫీతో మహేష్‌ టెన్షన్ క్లియర్
X
కొత్త సినిమా రిలీజ్ కాబోతోంది అంటే ప్రేక్షకులు దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ మొదలు కావడం సహజమే. పైకి చెప్పకపోయినా ఎంతో కొంత టెన్షన్ అందరిలోనూ ఉంటుంది. తనవరకు అది ఏ రేంజిలో ఉంటుందో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా బయటపెట్టాడు.

మహేష్ హీరోగా నటించిన భరత్ అనే నేను మూవీ ఈనెల 20న థియేటర్లకొచ్చింది. ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది. సినిమా రిలీజుకు మూడు రోజుల ముందునుంచే.. అంటే 17వ తేదీ నుంచి తనకు టెన్షన్ మొదలైందని మహేష్ చెప్పుకొచ్చాడు. ‘‘గ్లాస్ పట్టుకుంటే చెయ్యి వణికేది. దాంతో తరవాత రోజు అమ్మను కలిసి ఆమె చేత్తో ఓ కప్పు కాఫీ తాగాను. దెబ్బకు టెన్షన్ మొత్తం దిగిపోయింది.’’అంటూ తాను టెన్షన్ నుంచి బయటపడ్ట మార్గమేంటో చెప్పాడు మహేష్.

భరత్ అనే నేను విజయం చాలా గొప్పగా అనిపిస్తోందని... ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు డైరెక్టర్ కొరటాల శివతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తానని సినిమా సక్సెస్ మీట్ లో మహేష్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ హీరోయిన్ కియారా అద్వాణీ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు.