Begin typing your search above and press return to search.

ప్రభాస్ ని ఫాలో అవ్వబోతున్న మహేష్‌.. అమ్మకోసం బుర్రిపాలెం

By:  Tupaki Desk   |   10 Oct 2022 12:46 PM GMT
ప్రభాస్ ని ఫాలో అవ్వబోతున్న మహేష్‌.. అమ్మకోసం బుర్రిపాలెం
X
రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతి చెందిన నేపథ్యంలో ఆయన సొంత గ్రామం అయిన మొగల్తూరు లో భారీ సంస్మరణ సభ ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. చుట్టు పక్కల నాలుగు అయిదు జిల్లాల నుండే కాకుండా తెలుగు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున కృష్ణంరాజు అభిమానులు మరియు ప్రభాస్ అభిమానులు మొగల్తూరు లో జరిగిన సంస్మరణ సభలో పాల్గొన్నారు.

ఇటీవలే మహేష్ బాబు యొక్క అమ్మగారు ఇందిరా దేవి గారు మృతి చెందిన విషయం తెల్సిందే. ఆమె మృతి నేపథ్యంలో ఇప్పటికే ఫిల్మ్‌ ఇండస్ట్రీ మరియు ప్రముఖులతో కలిసి హైదరాబాద్‌ లో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ యొక్క జ్ఞాపకార్థం.. ఎప్పటికీ గుర్తు ఉండి పోయేలా మహేష్ బాబు బుర్రిపాలెంలో భారీ సంస్మరణ సభ నిర్వహించబోతున్నారట.

మహేష్ బాబుకు తల్లి ఇందిరా దేవి అంటూ అమితమైన ప్రేమాభిమానం అనే విషయం తెల్సిందే. అమ్మ గురించి ఎప్పటికి గుర్తు ఉంచుకునేలా... ఎప్పుడు మాట్లాడుకునేలా బుర్రిపాలెంలో సంస్మరణ సభ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరి సూచన మేరకు మహేష్ బాబు ఆలోచిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈనెల 16న బుర్రిపాలెం లో ఇందిరా దేవి గారి సంస్మరణ సభ నిర్వహించబోతున్నారు. కృష్ణ తో పాటు కుటుంబం మొత్తం కూడా హాజరు అవ్వబోతున్నారు. సినిమా ఇండస్ట్రీ వారు పాల్గొనక పోవచ్చు. కానీ స్థానిక సూపర్‌ స్టార్‌ అభిమానులు లక్షలాది మంది పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.