Begin typing your search above and press return to search.

స్పైడర్ ముగియక ముందే సీఎం సినిమా

By:  Tupaki Desk   |   22 April 2017 4:26 PM GMT
స్పైడర్ ముగియక ముందే సీఎం సినిమా
X
మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పైడర్ కు ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉందనే విషయం తేటతెల్లమైపోయింది. అందుకే జూన్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఓ వారం క్రితం వరకూ చెప్పినా.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

ఈ స్పైడర్ కోసం మహేష్ జూన్ 10 వరకూ షూటింగ్ చేయనున్నాడట. ఆ తర్వాత రెండు వారాల్లో అన్నీ పూర్తి చేసే ఛాన్స్ ఏ మాత్రం లేదు. అందుకే ఆగస్ట్ రిలీజ్ అన్నారు. అయితే.. స్పైడర్ మూవీ షూటింగ్ పూర్తయేందుకు ముందే మహేష్ తన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టేయనుండడం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' అనే మూవీ మహేష్ చేయనున్నాడు. సూపర్ స్టార్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించే ఈ మూవీ.. మే 18 న షూటింగ్ ప్రారంభం కానుండగా.. మే నెలాఖరు వరకూ తొలి షెడ్యూల్ సాగనుంది.

ఈ రెండు వారాలకు గాను.. మొత్తం 8 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట సూపర్ స్టార్. ప్రస్తుతం మహేష్ హీరో అనే విషయం తప్ప.. మిగిలిన డీటైల్స్ ను దర్శకుడు కొరటాల శివ వెల్లడించలేదు. అయితే.. మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉన్న బోలెడన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే ఈ చిత్రాన్ని.. శ్రీమంతుడు కంటే గ్రాండ్ లెవెల్ లో ఉంచేందుకు తెగ కష్టపడుతున్నాడు కొరటాల శివ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/