Begin typing your search above and press return to search.

ఆనందాన్ని అందరికీ పంచేసిన మహేష్

By:  Tupaki Desk   |   14 Jan 2020 4:50 AM GMT
ఆనందాన్ని అందరికీ పంచేసిన మహేష్
X
మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని ఇండస్ట్రీలో పేరుంది.. పండుగొచ్చినా పబ్బమొచ్చినా.. ఆనందమొచ్చినా ఆయన ఏదీ దాచుకోడు.. 'తిరిగిచ్చేస్తాడు.. లేకపోతే లావైపోతాడేమో' అందుకే.. తనకు లభించిన విజయాన్ని కూడా అందరికీ పంచిపెట్టాడు..

తాజాగా సంక్రాంతి రేసులో నిలబడి రిలీజ్ అయిన 'సరిలేరు నీకెవ్వరూ' మూవీ మోస్తారు విజయాన్నే దక్కించుకుంది. సంక్రాంతి సెలవులు కావడంతో సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ కాకున్నా హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుందని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో మహేష్ బాబు తాజాగా తన ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చేశాడు.

సరిలేరు రిలీజ్ అయిన తర్వాత ఇచ్చిన ఈ పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, హీరోయిన్ రష్మిక, దర్శకుడు పైడిపల్లి వంశీ, నమ్రత, అనిల్ సుంకర తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని మహేష్ బాబు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు.

మహేష్ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేస్తూ 'బ్లాక్ బస్టర్ పార్టీ కంటిన్యూస్.. సరిలేరు నీకెవ్వరు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తనకు దక్కిన విజయాన్ని అందరితో పంచుకున్నారు.