Begin typing your search above and press return to search.
కొరటాలకు దిమ్మ తిరిగే షాకిచ్చిన మహేష్
By: Tupaki Desk | 21 Sept 2015 1:09 PM ISTరెండు పెద్ద ఫ్లాపుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. కేవలం హిట్ అందుకోవడమే కాదు.. అంతకుమించి ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. ఈ ఆనందానికి కారణమైన వ్యక్తికి కృతజ్నతలు చెప్పుకోకుంటే ఎలా మరి. అందుకే కొరటాలకు భారీ బహుమతి రూపంలో థ్యాంక్స్ చెప్పుకున్నాడు మహేష్. ‘శ్రీమంతుడు’ లాంటి మరపురాని సినిమాను తనకందించిన డైరెక్టర్ కొరటాలకు లగ్జీరియస్ ఆడి-6 కారును మహేష్ బహుమతిగా ఇచ్చినటట్లు సమాచారం. ఈ కారు విలువ రూ.50 లక్షల దాకా ఉంటుందని తెలిసింది.
ఈ గిఫ్ట్ మామూలుగా ఇవ్వలేదు మహేష్. కొరటాలకు దిమ్మదిరిగిపోయేలా సడెన్ సర్ ప్రైజ్ గా అందించాడు. ఆదివారం రాత్రి విషయం చెప్పకుండా కొరటాలకు ఫోన్ చేసి షో రూంకి పిలిపించాడట మహేష్. అక్కడికొచ్చాక కారు చూపించి తాళాలు చేతిలో పెట్టేశాడట. దీంతో కొన్ని నిమిషాలు కొరటాలకు ఏమీ పాలుపోలేదట. ఆ సమయంలో మహేష్ భార్య నమ్రత కూడా అక్కడే ఉందట. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయిన కొరటాల కొన్ని నిమిషాల తర్వాతే తేరుకున్నాడట.
‘శ్రీమంతుడు’ సినిమా మహేష్ కు హీరోగానే కాదు, నిర్మాతగానూ అమితానందాన్ని మిగిల్చింది. పారితోషకం తీసుకోకుండా వాటా తీసుకున్న మహేష్ సాధారణంగా రెమ్యూనరేషన్ కింద తీసుకునే మొత్తం కంటే ఓ ఐదు కోట్లు ఎక్కువే అందుకున్నాడు. అందులోంచి కొంచెం వాటా తీసి కొరటాలకు కారు రూపంలో బహుమతి అందించాడన్నమాట.