Begin typing your search above and press return to search.

భీష్మ డైరెక్టర్​ తో మహేశ్​ కొత్త సినిమా? స్టోరీకి ఫిదా అయిన ప్రిన్స్​..!

By:  Tupaki Desk   |   7 Dec 2020 11:51 AM IST
భీష్మ  డైరెక్టర్​ తో మహేశ్​ కొత్త సినిమా? స్టోరీకి ఫిదా అయిన ప్రిన్స్​..!
X
‘భీష్మ’ చిత్రంతో బ్లాక్​బ్లస్టర్​ అందుకున్న డైరెక్టర్​ వెంకీ కుడుములకు ఓ బంపర్​ ఆఫర్​ వచ్చిందట. వెంకీ చెప్పిన కథ నచ్చి అతడితో సినిమా చేయడానికి మహేశ్​బాబు ఒప్పుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఇటు ఫిలింనగర్​లోనూ, అటు సోషల్​మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నది. లాక్​డౌన్​ సమయంలో కూడా ఈ వార్త వినిపించింది. వెంకీ దర్శకత్వంలో మహేశ్​ నటించబోతున్నడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తను అటు మహేశ్​బాబు కానీ, ఇటు వెంకీ గానీ ధ్రువీకరించలేదు. అయితే ఇప్పడు మరోసారి ఇదే వార్త వినిపిస్తున్నది. వెంకీ చెప్పిన ఓ సబ్జెక్ట్​ మహేశ్​బాబుకు తెగ నచ్చేసిందట. అతడు వినిపించిన స్టోరీ లైన్​ నచ్చడంతో ఫుల్​ స్ట్రిప్ట్​తో రమ్మని వెంకీకి చెప్పాడట. ఆ తర్వాత వెంకీ ఫుల్​ ఫుల్​ స్ట్రిప్ట్ సిద్ధం చేసుకుని వెళ్లి మహేశ్​ కి వినిపించగా ప్రిన్స్ ఫిదా అయ్యాడట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నది.

వెంకీ కుడుముల నితిన్ తో చేసిన భీష్మ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. మరోవైపు వెంకీ డైరెక్షన్​కు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో మహేశ్​ కూడా కథను విని ఓకే చెప్పినట్టు టాక్​. ప్రస్తుతం మహేశ్​ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే కొత్త మూవీకి ఒకే చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్​ అయిన సర్కారు వారి పాట మోషన్​ పోస్టర్​ మహేశ్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నది. ఈ చిత్రానికి పరశురామ్​ దర్శకత్వం వహిస్తున్నారు.

మైత్రీమూవీ మేకర్స్​, 14 రీల్స్​ ఎంటర్​టైన్​మెంట్స్​ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముందుగా వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల పరుశరామ్​ కు చాన్స్​ దక్కింది. పరుశరామ్​ గత చిత్రం గీతా గోవిందం భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.