Begin typing your search above and press return to search.

స‌రిలేరు.. తొమ్మిదితో త‌కిదిమితోం!

By:  Tupaki Desk   |   3 Dec 2019 1:30 AM GMT
స‌రిలేరు.. తొమ్మిదితో త‌కిదిమితోం!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో భారీ బెట్టింగ్ నేప‌థ్యంలో చిత్ర‌బృందం తెలివైన ప్ర‌మోష‌న్ మార్గాల‌ని అన్వేషిస్తోంది. ఇప్ప‌టికే కాంపిటీష‌న్ లో ప్ర‌మోష‌న్స్ ప‌రంగా పైమెట్టున ఉండేలా మ‌హేష్ - అనీల్ రావిపూడి అండ్ టీమ్ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో 9 అంకె సెంటిమెంట్ అంద‌రినీ విస్మ‌య‌ప‌రుస్తోంది. తొమ్మిది (9) సెంటిమెంటుతోనే మ‌హ‌ర్షి చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ఇప్పుడు దానినే అనుస‌రిస్తున్నార‌ట‌. మ‌హ‌ర్షి టైమ్ లో టీజ‌ర్.. పోస్ట‌ర్.. పాట‌ల్ని రిలీజ్ చేసిన‌ప్పుడు డేట్ లో మొత్తం అంకెల్ని క‌లిపితే 9 (తొమ్మిది) వ‌చ్చేలా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఆ సెంటిమెంట్ వ‌ర్క‌వుటై సినిమాకి మంచి హిట్ట‌య్యింద‌ని మ‌హేష్‌ టీమ్ భావిస్తోంద‌ట‌.

ఆ సెంటిమెంటును ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న స‌రిలేరు నీకెవ్వ‌రు ప్ర‌మోష‌న్ లోనూ ఫాలో అవుతోంది అందుకే. ఈ సినిమా నుంచి ఏ ఒక్క‌ పోస్ట‌ర్ రిలీజ్ చేసినా.. టీజ‌ర్ రిలీజ్ చేసినా సాయంత్రం 5.04 నిమిషాల‌కు అంటూ ప్ర‌క‌టిస్తున్నారు. ఆ రెండు నంబ‌ర్ల‌ను క‌లిపితే తొమ్మిది (9) వ‌స్తుంది. అది త‌మ‌కు సెంటిమెంటుగా క‌లిసొస్తోంద‌ని చిత్ర‌బృందం న‌మ్ముతోంద‌ట‌. నేటి (సోమ‌వారం) సాయంత్రం రిలీజైన `మైండ్ బ్లాక్` పాట‌కు అదే సెంటిమెంటును ఫాలో చేస్తూ 5.04 పీఎం కి రిలీజ్ చేశారు. ఇక‌పై రిలీజ‌య్యే ప్ర‌తి పాట‌ను ఇదే స‌మ‌యానికి రిలీజ్ చేస్తార‌ట‌. 5.04 పీఎం సెంటిమెంటును వ‌దిలిపెట్ట‌ర‌ట‌. లేదంటే అన్ని అంకెల్ని క‌లిపితే 9 వ‌చ్చేలా చూసుకుని పాట‌ల్ని రిలీజ్ చేస్తారు. ప్ర‌తి సోమ‌వారం మాస్ ఎంబీ సాంగ్స్ సాయంత్రం 5.04 పీఎంకే వ‌స్తాయ‌ని ఫిక్స‌యిపోవ‌చ్చు. ఈనెలంతా ఫ్యాన్స్ కి ఈ ట్రీట్ ఉంటుంది. ఇక తొమ్మిది నంబ‌ర్ ఎన్టీఆర్ కి కూడా సెంటిమెంట్. త‌నలానే మ‌హేష్ కూడా ఆ నంబ‌ర్ సెంటిమెంటును అనుస‌రిస్తున్నారంటూ ఓ సెక్ష‌న్ ఫ్యాన్స్ ప్ర‌చారం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.