Begin typing your search above and press return to search.
అమెరికాకు పయనమైన సూపర్ స్టార్ ఫ్యామిలీ
By: Tupaki Desk | 19 Jan 2020 3:47 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. షూటింగ్ లేకపోతే చాలు కుటుంబంతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. ఎక్కువ రోజులు బ్రేక్ దొరికితే మాత్రం తన కుటుంబ సభ్యులతో విదేశాలకు విహార యాత్ర ప్లాన్ చేసుకుంటారు. 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ పూర్తి కావడంతో ఈసారి కూడా హాలిడే ట్రిప్ కు బయలుదేరారు.
మహేష్ సతీమణి నమ్రత ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కేందుకు వెళ్తున్న ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "మేము వెళ్తున్నాం #హ్యాపీ హాలిడేస్ # బ్లాక్ బస్టర్ కా బాప్ #సరిలేరు నీకెవ్వరు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మహేష్ ఫ్యామిలీ అమెరికాకు వెళ్ళారని.. ఈ ట్రిప్ రెండు నెలల పాటు కొనసాగుతుందని సమాచారం. ఈ ట్రిప్ లో మహేష్.. నమ్రత.. గౌతమ్.. సితారలతో పాటుగా దర్శకుడు.. మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ మెహర్ రమేష్ బయలుదేరి వెళ్ళారు.
'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేష్ తన నెక్స్ట్ ఫిలిం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ సాగుతోందని.. మహేష్ అమెరికా ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సినిమాను లాంచ్ చేస్తారని సమాచారం.