Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సూపర్ సౌత్ స్టార్స్

By:  Tupaki Desk   |   5 Oct 2019 11:54 AM IST
ఫోటో స్టోరీ: సూపర్ సౌత్ స్టార్స్
X
నేషనల్ మ్యాగజైన్లు అనగానే సహజంగా హిందీ స్టార్లకు.. బాలీవుడ్ బ్యూటీలకే ప్రాధాన్యం ఉంటుంది. ఇక కవర్ పేజిలపై దాదాపుగా వారే ఉంటారు. అయితే ఈసారి ప్రఖ్యాత మ్యాగజైన్ వోగ్ వారు సౌత్ పై దృష్టి సారించారు. ఇప్పటికీ వోగ్ అక్టోబర్ ఎడిషన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తారని హింట్ ఇచ్చారు. తాజాగా ఈ అక్టోబర్ మ్యాగజైన్ కవర్ పేజ్ పిక్స్ తమ అధికారిక ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు.

అక్టోబర్ కవర్ పేజిపై సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటుగా మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. లేడీ సూపర్ స్టార్ నయనతార జాయింట్ గా కనిపించారు నయనతార కవర్ పేజిల కోసం ఫోటో షూట్ లు చేయడం చాలా అరుదు. అయితే ఇది వోగ్ 12 వ వార్షికోత్సవం.. ప్రత్యేకమైన సందర్భం కావడంతో కవర్ పేజి షూట్ కు ఒకే చెప్పారు. ఈ ఫోటోకు "సెలబ్రేటింగ్ ది బెస్ట్ ఆఫ్ సౌత్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలో మహేష్ ఎప్పటి లాగే హ్యాండ్సమ్ గా ఉన్నారు. మహేష్.. దుల్కర్ ఇద్దరూ మోడరన్ సూట్లలో స్టైలిష్ పోజివ్వగా నయనతార ఫ్రిల్స్ ఉండే థై స్లిట్ గౌన్ లో బ్యూటిఫుల్ పోజిచ్చింది. కవర్ పేజిపై 'సూపర్ సౌత్' అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మరో ఫోటోలో మహేష్ వైట్ టీ షర్టు- బ్లాక్ ప్యాంట్.. షైనీ షూస్ ధరించి ఒక కుర్చీలో కూర్చొని సూపర్ పోజిచ్చారు. ఈ దెబ్బతో చాలామంది అమ్మాయిలకు నిద్ర అవుట్.

ఈమధ్య సౌత్ సినిమాలకు డిమాండ్ పెరగడంతో సౌత్ స్టార్లపై దేశవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతుంది. దీంతో ఫ్యాషన్ అండ్ గ్లామర్ మ్యాగజైన్లు సౌత్ స్టార్ల పై దృష్టి సారించాయి. ఈ లెక్కన ఫ్యూచర్ లో సౌత్ స్టార్ల క్రేజ్ ఆకాశాన్ని టచ్ చేయడం ఖాయమే.